సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీష్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని తన నివాసంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడాలంటే శాసనసభ తీర్మానం అవసరం లేదని, కేవలం సభ అభిప్రాయం మాత్రమే కోరతారన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై పూర్తి అధికారం పార్లమెంటుకే ఉంటుందన్న విషయం స్పీకర్‌గా పనిచేసిన ముఖ్యమంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. సీల్డ్‌కవర్ ముఖ్యమంత్రి.. అన్నం పెట్టిన పార్టీకే వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు.
తెలంగాణ అంశంపై అసెంబ్లీలో తీర్మానాన్ని అడ్డుకుంటానని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ బూటకపు మాటలతో సీమాంధ్ర ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని తెలిపారు. పదవులపై ఆశతోనే కిరణ్‌కుమార్‌రెడ్డి తెలుగు భాషపై స్పష్టత కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. సంవత్సరం క్రితం మెదక్ జిల్లాలో పర్యటించినప్పుడు హైకమాండ్ నిర్ణయం శిరోధార్యం అన్న ముఖ్యమంత్రి నేడు హైకమాండ్‌కే వ్యతిరేకంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
‘ముఖ్యమంత్రికి మతి భ్రమించింది’
Published Mon, Dec 9 2013 12:27 AM | Last Updated on Mon, Aug 13 2018 4:01 PM
Advertisement