
సాక్షి, విజయవాడ: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 2, విశాఖపట్నంలో 1 నమోదయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 164కు చేరుకుంది. కరోనా నుంచి కోలుకున్న ఇద్దరిని శుక్రవారం డిశ్చార్జ్ చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఒంగోలు, రాజమండ్రిలో ఒక్కొక్కరు చొప్పున డిశ్చార్జ్ అయ్యారని ప్రకటించింది. మొత్తం ఇప్పటి వరకు నలుగురు బాధితులు డిశ్చార్జ్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment