
సాక్షి, కడప సిటీ: పులివెందుల పట్టణం మంగళవారం నుంచి గ్రీన్‌జోన్‌లోకి చేరింది. ఇంతవరకు కంటైన్మెంట్ జోన్ ఆంక్షలు ఉండగా, సోమవారం నాటికి సమాప్తమయ్యాయి. ఈ మేరకు కలెక్టర్ హరి కిరణ్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. పులివెందులలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కంటైన్మెంట్ జోన్‌లో ఉండాల్సిన ఆంక్షలను కఠినంగా అమలు చేశామన్నారు. ఇక్కడ చివరి కేసు ఏప్రిల్ 6వ తేదీ నమోదైందన్నారు. ఈ ప్రాంతంలో పాజిటివ్ వచ్చిన ఆఖరి కేసు కూడా నెగిటివ్ రిపోర్టు రావడంతో ఏప్రిల్ 20 న డిశ్చార్జి చేసినట్లు ఆయన చెప్పారు. అప్ప టి నుంచి 28 రోజులపాటు పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో గ్రీన్‌జోన్‌గా ప్రకటించామని తెలిపారు. (భారత్‌లో లక్ష దాటేసిన కరోనా కేసులు)
నలుగురు డిశ్చార్జ్
కోవిడ్ నుంచి కోలుకున్న నలుగురిని సోమవారం డిశ్చార్జ్ చేసినట్లు కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. తిరుపతి స్టేట్ కోవిడ్ ఆస్పత్రి స్విమ్స్ నుంచి నలుగురిని డిశ్చార్జ్ చేశారని వివరించారు. వీరు కడప నగరానికి చెందిన వారేనని, వీరిలో 51, 60 సంవత్సరాల వయస్సుగల ఇద్దరు పురుషులు, 45, 69 సంవత్సరాలుగల మహిళలు కోలుకున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment