హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి
పటాన్‌చెరు, న్యూస్‌లైన్: సమాజంలో అవినీతి అంతర్భాగంగా మారిపోయిందని హైకోర్టు న్యాయమూర్తి సీవీ నాగార్జునరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మనుషులు నీతివంతంగా బతకడం నేర్చుకోవాలని ఉద్బోధించారు. అక్షయ పాత్ర సంస్థ ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తోంది. ఈ సంస్థ పరిధిలోని పాఠశాలలకు హైదరాబాద్ ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేర్ సంస్థ సౌజన్యంతో శనివారం 190 కంప్యూటర్లను అందజేశారు. ఈ కార్యక్రమం మెదక్ జిల్లా పటాన్‌చెరు అక్షయ పాత్ర కార్యాలయంలో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ నాగార్జునరెడ్డి కంప్యూటర్లను జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్‌కు అందజేశారు.
సమాజంలో అవినీతి పెచ్చరిల్లింది: జస్టిస్ నాగార్జునరెడ్డి
Published Sun, Aug 18 2013 1:51 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement