CV nagarjuna reddy
-
జగన్ సర్కారు పూర్తి స్వేచ్ఛనిచ్చింది
‘ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్చేచ్ఛనిచ్చింది. అందువల్లనే గత ఐదేళ్లలో అనేక లక్ష్యాలను విజయవంతంగా చేరుకోగలిగాం. 250 ఆర్డర్లు, 27 నిబంధనలను జారీ చేయగలిగాం’ అని మండలి చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. 2019 అక్టోబర్ 30న ఏపీఈఆర్సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన మంగళవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం, ఏపీఈఆర్సీ విజయాలు, ఎదురైన అవరోధాల గురించి ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ⇒ ఐదేళ్లలో విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరును మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకున్నాం. విద్యుత్ ప్రమాదాలు జరిగినప్పుడు అందులో డిస్కం తప్పిదం ఉన్నా లేకున్నా కూడా బాధితులకు పరిహారం అందేలా నిబంధనలు రూపొందించాం. ⇒ మూడు గ్రామీణ విద్యుత్ సరఫరా సహకార సంస్థ (రెస్కో)ల వల్ల కలిగే నష్టాలను బేరీజు వేసి.. వాటిని డిస్కంల్లో విలీనం చెయ్యాలనే సాహసోపేత ఉత్తర్వులిచ్చాం. ప్రభుత్వం నుంచి సబ్సిడీ చెల్లింపులు ఆలస్యమైతే డిస్కంలు సర్‌ఛార్జీ వసూలు చేసుకునే అవకాశం కల్పించడమనేది దేశంలో మరెక్కడా లేదు. ⇒ వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను శాశ్వతంగా అందించే ఆలోచనలో భాగంగా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ఆమోదం తెలిపాం. ఎన్ని ఒత్తిళ్లు, విమర్శలు వచ్చినా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా దీనిని ముందుకు తీసుకెళ్లాం. వినియోగదారులపై ఎటువంటి భారం పడకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ⇒ వచ్చే ఐదేళ్లు విద్యుత్ సంస్థల బలోపేతానికి, కొత్త సబ్స్టేషన్లు, లైన్ల నిర్మాణానికి జాప్యం లేకుండా అనుమతులిచ్చాం. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు లక్ష్యాలను చేరలేకపోతే వాటి స్థిర చార్జీలలోనే కోత ఉండేది. పూర్తిస్థాయి ఉత్పత్తి కోసం వాటికి పెనాల్టీలూ వేస్తున్నాం. ప్రతి ఏటా గడువులోగా రిటైల్ సరఫరా ధరల ఉత్తర్వులు విడుదల చేశాం. ⇒ ఓపెన్ యాక్సెస్ వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు ఇప్పటివరకు అదనపు సర్‌చార్జీ ప్రతిపాదనలను ఆమోదించలేదు. రైస్ మిల్లులు, పల్వరైజర్ పరిశ్రమలకు 150 హెచ్‌పీ లోడు వరకు ఎల్టీ టారిఫ్ ద్వారా విద్యుత్ వాడుకొనే అవకాశం కల్పించాం. ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణకు అవకాశమిచ్చాం. విద్యుత్ సంస్థల ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాల పరిరక్షణకు పెన్షన్ ట్రస్ట్‌లకు నిర్దేశిత మొత్తాలను నిరీ్ణత సమయంలో ఖచ్చితంగా జమ చేయాలని ఆదేశించాం. ⇒ అవసరం మేరకు బహిరంగ మార్కెట్లో అతి తక్కువ ధరకు దొరికే విద్యుత్‌ను సేకరించేలా చేశాం. తద్వారా 2020–21లో దాదాపు రూ.4,700 కోట్లు ట్రూ డౌన్ చేసి ఆ మొత్తాన్ని చరిత్రలో తొలిసారిగా వినియోగదారులకు బిల్లుల్లో వెనక్కి ఇప్పించాం. మనం రూపొందించిన పునరుద్ధరణీయ ఇంధన విధానం నమూనా నిబంధనలు దేశానికి ఆదర్శమయ్యాయి. వినియోగదారులకు సమాచారంలో పారదర్శకతను పెంచాం. ⇒ గృహ విద్యుత్ వినియోగదారుల మూడు కేటగిరీలని ఒకే గ్రూపు చేయడం ద్వారా బిల్లుల భారం తగ్గించాం. ఆదాయ పన్ను చెల్లింపుదారు అనే నిబంధన తొలగించి ప్రతి రైతును ఉచిత విద్యుత్ కేటగిరీ కిందకు తెచ్చాం. గృహ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని డిస్కంలు చేసిన సింగల్ పాయింట్ బిల్లింగ్ ప్రతిపాదనలను తిరస్కరించాం. -
విద్యుత్ సంస్థలు చట్టాన్ని అనుసరించాల్సిందే
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థలు చట్టం పరిధిలోనే పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి చెప్పారు. విద్యుత్ చట్టం–2003 సెక్షన్ 88 ప్రకారం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంతోపాటు వినియోగదారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పంపిణీ సంస్థలపై ఉందని గుర్తుచేశారు. వర్చువల్‌గా సోమవారం జరిగిన ఈ సమావేశంలో ఆయనతోపాటు ఏపీఈఆర్సీ సభ్యులు పి.రాజగోపాల్‌రెడ్డి, ఠాకూర్ రామసింగ్ హైదరాబాద్‌లోని కార్యాలయం నుంచి, సలహామండలిలోని 16 మంది సభ్యులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వినియోగదారులకు అందించే సేవలను మెరుగుపరిచేందుకు పౌరసేవల ప్రమాణాలను (ఎస్‌వోపీని) సవరించినట్లు తెలిపారు. దీనివల్ల కొన్ని సేవల వైఫల్యంపై వినియోగదారుల ఫిర్యాదు మేరకు డిస్కంలు ఆటోమేటిక్‌గా పరిహారం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇంధన పొదుపు, సంరక్షణ కార్యక్రమాలను ప్రోత్సహించడంలో ఏపీఈఆర్సీ క్రియాశీల పాత్ర పోషిస్తోందన్నారు. డిస్కంలు సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటూ, వినియోగదారులకు సాధ్యమైనంత ఉత్తమంగా ప్రయోజనాలు అందించాలని ఆయన సూచించారు. సేవా ఖర్చు తగ్గింపు, విద్యుత్ కొనుగోళ్ల క్రమబద్ధీకరణ, మెరుగుపరచడం, డిస్కంల పనితీరు, ప్రజల సమర్థమైన భాగస్వామ్యం, నియంత్రణ నిర్ణయ ప్రక్రియ, విద్యుత్ లైన్లు పంట చేలపై నుంచి వేయాల్సి వచ్చినపుడు రైతులకు పరిహారం చెల్లింపు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. సభ్యుల సూచనలపై చట్టం పరిధిలో చర్యలు తీసుకుంటామని చైర్మన్ పేర్కొన్నారు. -
విద్యుత్ చార్జీలు ప్రకటించిన ఏపీఈఆర్సీ
సాక్షి, అమరావతి: ప్రజలపై ఏమాత్రం విద్యుత్ ఛార్జీల భారం వేయకుండా.. పెంచాల్సిన మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తూ.. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) 2020–21 సంవత్సరానికి గాను కొత్త విద్యుత్ చార్జీలను సోమవారం ప్రకటించింది. సవరించిన టారిఫ్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. హైదరాబాద్‌లోని ఏపీఈఆర్సీ కార్యాలయంలో నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, సభ్యులు పి.రఘు, రామ్మోహన్ కొత్త టారిఫ్ ప్రతులను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. 99 శాతం విద్యుత్ వినియోగదారులపై ఏమాత్రం భారం పడకుండా, విద్యుత్ పంపిణీ సంస్థలకు నష్టం వాటిల్లకుండా టారిఫ్‌ను రూపొందించామన్నారు. డిస్కమ్‌ల ప్రతిపాదనలపై రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో వ్యక్తమైన అంశాలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని ఆయన తెలిపారు. విద్యుత్ చార్జీల రూపంలో ప్రజలపై పడాల్సిన భారాన్నంతా సర్కారే భరిస్తోంది. ప్రభుత్వం డిస్కమ్‌లకు ఉదారంగా పెద్దఎత్తున సబ్సిడీ ఇవ్వడంవల్లే పేదలపై భారం పడలేదని నాగార్జునరెడ్డి తెలిపారు. డిస్కమ్‌లు తమ వార్షిక ఆదాయ అవసరాలను రూ.14,349.07 కోట్లుగా చూపించాయని, దీన్ని కమిషన్ మదించి రూ.12,954.11 కోట్లుగా తేల్చిందన్నారు. ఇందులో రూ.2,893.48 కోట్ల మేర వివిధ రూపాల్లో డిస్కమ్‌లు సమకూర్చుకునేలా అవకాశం కల్పించామన్నారు. మిగిలిన రూ.10,060.63 కోట్లలో.. వ్యవసాయ ఉచిత విద్యుత్ కోసం రూ.8,353.58 కోట్లు.. ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చినట్లు తెలిపారు. గత ఏడాది ప్రకటించిన సబ్సిడీ (రూ.7,064.27)తో పోలిస్తే ఇది 18 శాతం ఎక్కువని ఆయనన్నారు. అలాగే, రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గృహ విద్యుత్ వినియోగదారుల తరఫున రూ.1,707.07 కోట్లు సబ్సిడీ ఇవ్వడంవల్ల పేదలపై ఏమాత్రం భారం పడకుండా టారిఫ్ ఇవ్వగలిగినట్లు నాగార్జునరెడ్డి వెల్లడించారు. (చదవండి: వ్యవ'సాయం'.. విప్లవాత్మకం) జిమ్మిక్కులు.. దొడ్డిదారి వడ్డనకు స్వస్తి ► గత టీడీపీ ప్రభుత్వం అనేక దొడ్డిదారి మార్గాల్లో విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపింది. ఇందులో శ్లాబుల వర్గీకరణ ఒకటి. గత ఏడాది వినియోగాన్ని కొలమానంగా తీసుకుని ప్రస్తుత సంవత్సరంలో అత్యధిక విద్యుత్ భారం మోపేవారు. ఉదా.. గత ఏడాది విద్యుత్ వినియోగం 600 దాటి 601కి చేరితే.. ప్రస్తుత విద్యుత్ టారిఫ్‌లో 0–50 యూనిట్లకు యూనిట్‌కు రూ.1.45 బదులు రూ.2.60 వసూలు చేసేవారు. ఇలాంటి పరోక్ష పద్ధతులకు ప్రస్తుత కమిషన్ స్వస్తి పలికింది. ►అలాగే, సంపన్న వర్గాలకు (500 యూనిట్లు దాటితే) యూనిట్‌కు కేవలం 90 పైసలు పెంచింది. (రూ.9.05 నుంచి 9.95 చేసింది). ఇలాంటి వారు రాష్ట్రంలో 1,43,65,000 మంది ఉన్నారు. ఈ పెంపువల్ల వచ్చే ఆదాయం గరిష్టంగా రూ.50 కోట్లు మాత్రమే. అంటే.. 1.45 కోట్ల మందిపై పైసా కూడా భారం పడదు. పరిశ్రమలకు ఫుల్ పవర్ ఏపీలో పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా విద్యుత్ టారిఫ్‌లో ఆ రంగానికి పెద్దపీట వేశారు. విద్యుత్ బిల్లుల భారం పడకుండా సమతుల్యం పాటించడం విశేషం. ఎలాగంటే.. ► లాభాపేక్ష లేని ప్రభుత్వ విద్యాలయాలు, ఆసుపత్రులను వాణిజ్య కేటగిరీ నుంచి హెచ్‌టీలోని సాధారణ కేటగిరీలో చేర్చారు. దీనివల్ల టైమ్ ఆఫ్ డే (పీక్.. నాన్ పీక్ అవర్స్‌లో వేర్వేరు ధరలు) ధరల నుంచి తప్పించారు. ► దోభీఘాట్లకు ఉచిత విద్యుత్ కొనసాగుతుంది. ► రైల్వేలకు వర్తించే ధరలను యూనిట్‌కు రూ.6.50 చొప్పున డిస్కమ్‌లు ప్రతిపాదిస్తే.. కమిషన్ దాన్ని రూ.5.50కు పరిమితంచేసింది. ► విద్యుత్ వాహనాల యూనిట్ ప్రతిపాదిత ధరను రూ.12.25 నుంచి రూ. 6.70కి తగ్గించారు. ► అత్యధికంగా విద్యుత్ వాడకం ఉండే పరిశ్రమలకు రాయితీలుంటాయి. రైస్, పల్వరైజింగ్ మిల్లుల లోడ్‌ను 100 హెచ్‌పి నుంచి 150 హెచ్‌పికి పెంచారు. పరిశ్రమల్లో కాంట్రాక్టు డిమాండ్ కన్నా ఎక్కువ లోడ్ ఉంటే వేసే అపరాధ రుసుము ప్రతిపాదనలను కమిషన్ తిరస్కరించింది. కెపాసిటర్ సర్ ఛార్జీలను 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించడంవల్ల చిన్న తరహా వినియోగదారులకు ఊరట కల్పించారు. ► 5 కోట్లకు మించి ఏ పనులు చేపట్టాలన్నా ట్రాన్స్‌కో, డిస్కమ్‌లు ఇక మీదట ఏపీఈఆర్సీ అనుమతి తీసుకోవాల్సిందే. ► వ్యవసాయ భూముల్లో విద్యుత్ లైన్లు వేసేప్పుడు పరిహారం తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. ► చివరగా.. ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి కొత్తగా పీపీఏలు చేసుకునే డిస్కమ్‌ల ప్రతిపాదనను ఏపీపీఆర్సీ తిరస్కరించింది. ఐదేళ్లుగా బాదుడే బాదుడు.. 2004 నుంచి 2009 వరకూ సీఎంగా ఉన్న వైఎస్సార్ హయాంలో విద్యుత్ ఛార్జీలు ఒక్కపైసా పెరగలేదు. అంతకుముందు 2003 వరకూ రైతులపై ఉన్న విద్యుత్ బకాయిలను కూడా వైఎస్ సర్కార్ రద్దు చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. మూడుసార్లు ప్రత్యక్షంగా విద్యుత్ ఛార్జీలు పెంచింది. ఈ భారం రూ.2,178 కోట్లు. ఇది కాకుండా శ్లాబుల వర్గీకరణ, డిమాండ్ ఛార్జీల పేరుతో సాధారణ వినియోగదారులపైనే కాదు.. పరిశ్రమలపైనా పెద్దఎత్తున పరోక్షంగా విద్యుత్ భారం మోపింది. ఇది దాదాపు రూ.3 వేల కోట్లకు పైగా ఉంటుంది. వెరసి ఐదేళ్ల టీడీపీ పాలనలో ప్రజలపై పడిన విద్యుత్ ఛార్జీల భారం రూ.5వేల కోట్లపైనే. కానీ, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఒక్కపైసా పేదలపై భారం పడకుండా విద్యుత్ టారిఫ్ ప్రకటించడం విశేషం. -
అందుబాటు ధరల్లో నాణ్యమైన నిరంతర విద్యుత్
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) సమర్పించిన వార్షిక ఆదాయ అవసర నివేదికలపై మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి చెప్పారు. ప్రజలకు నాణ్యమైన నిరంతర విద్యుత్‌ను అందుబాటు ధరల్లో అందించాలన్నదే ఏపీఈఆర్సీ లక్ష్యమని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ వివరాలను ఇంధన పొదుపు అధికారి చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వివరించారు. విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాలకే ఏపీఈఆర్సీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని జస్టిస్ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. ప్రజలపై భారం లేని టారిఫ్ అవసరమని వెల్లడించారు. అలాగే డిస్కంల ఆర్థిక పరిపుష్టిని పరిగణనలోనికి తీసుకుంటామని వెల్లడించారు. విద్యుత్ రంగాన్ని మెరుగుపర్చి సుస్థిరత సాధించడానికి, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. కొనుగోలు వ్యయం తగ్గింపుపై దృష్టి విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించడంపై ఏపీఈఆర్సీ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించిందని జస్టిస్ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. బొగ్గు, జల, పవన, సౌర విద్యుత్ వంటి వాటి విషయంలో హేతుబద్ధత, సాంకేతికత, మార్కెట్ ట్రెండ్‌ను పరిగణనలోనికి తీసుకుంటామని వివరించారు. దీనివల్ల విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. విద్యుత్ సంస్థలు నిర్వహణ వ్యయం తగ్గించడంపైనా దృష్టి పెట్టాలన్నారు. ఇందుకోసం వ్యయంపై విచక్షణతో కూడిన అదుపు ఉంచడంతోపాటు అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాలని ఏపీఈఆర్సీ ఇప్పటికే డిస్కంలను కోరిందని గుర్తుచేశారు. వినియోగదారులే కేంద్ర బిందువు ప్రజలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడంతోపాటు సేవల్లో నాణ్యత, విశ్వసనీయత కూడా ముఖ్యమని జస్టిస్ నాగార్జునరెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ టారిఫ్‌లకు సంబంధించిన కసరత్తులో వినియోగదారులే కేంద్రబిందువుగా ఉంటారని వివరించారు. పంపిణీ సంస్థలు ప్రతిపాదించిన విద్యుత్ నివేదికలపై ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నట్టు ప్రకటించారు. ఈ నెల 7వ తేదీన విశాఖపట్నం, 8న ఏలూరు, 9న విజయవాడ, 10న కడప, 11న తిరుపతిలో ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా విద్యుత్ ఉన్నతాధికారులు ఏపీఈఆర్సీకి అందుబాటులో ఉండాలని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఆదేశాలు జారీ చేశారు. -
ఏపీఈఆర్సీ చైర్‌పర్సన్‌గా జస్టిస్ నాగార్జునరెడ్డి ప్రమాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్‌పర్సన్‌గా ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం జస్టిస్ నాగార్జునరెడ్డిని గవర్నర్, ముఖ్యమంత్రి.. సన్మానించారు. పలు జిల్లాల నుంచి న్యాయవాదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ బి.శేషశయనరెడ్డి, జస్టిస్ కృష్ణమోహన్‌రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ శంకరనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మంత్రులు కొడాలి నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, ధర్మాన కృష్ణదాసు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, అనిల్‌కుమార్, ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్, అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, మాజీ అడ్వొకేట్ జనరల్ సీవీ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం జస్టిస్ నాగార్జునరెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరికి మర్యాదపూర్వక ఫోన్ చేశారు. దీంతో ఆయన జస్టిస్ నాగార్జునరెడ్డిని హైకోర్టుకు ఆహ్వానించారు. నాగార్జునరెడ్డి గౌరవార్థం హైకోర్టులోనే తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులందరూ హాజరయ్యారు. దుర్గమ్మ సేవలో ఏపీఈఆర్సీ చైర్మన్ నాగార్జునరెడ్డి ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్పర్సన్ సీవీ నాగార్జునరెడ్డి బుధవారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. జస్టిస్ నాగార్జునరెడ్డికి వేద పండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ ఈవో ఎంవీ సురేష్‌బాబు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు. -
వరవరరావుపై ఆందోళన వద్దు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత పెండ్యాల వరవరరావును పోలీసులు బహిరంగంగానే అరెస్ట్ చేసినందున ఆయన ప్రాణాలకు హాని ఉంటుందనే అందోళన అవసరం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది ఒక వైపు జాతి ప్రయోజనాలు–మరోవైపు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన సున్నిత అంశమని హైకోర్టు అభిప్రాయపడింది. చట్ట నిబంధనలకు అనుగుణంగానే వరవరరావును అరెస్ట్ చేశారో లేదో అనే అంశంపైనే విచారణ జరపాల్సివుందని బుధవారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ల ధర్మాసనం పేర్కొంది. మహారాష్ట్ర పోలీసులు తన భర్త వరవరరావును అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని, ఆయనకు ప్రాణహాని ఉందని, వెంటనే ఆయనను కోర్టులో హాజరుపర్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ పి.హేమలత అత్యవసర వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని బుధవారం ధర్మాసనం విచారిస్తూ.. వరవరరావు అరెస్ట్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేసింది. వరవరరావును అరెస్ట్ చేసి మహారాష్ట్ర తీసుకువెళ్లేప్పుడు ఇచ్చిన ట్రాన్సిస్ట్ ఆర్డర్ కాపీని తెలుగులో అనువదించి హేమలతకు అందజేయాలని తెలంగాణ పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. ఈ అరెస్ట్‌పై కౌంటర్ వేయాలని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, మహారాష్ట్ర డీజీపీలను హైకోర్టు ఆదేశించింది. ట్రాన్సిస్ట్ ఆర్డర్ మరాఠీ బాషలో హేమలతకు అందజేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది సురేష్‌కుమార్ చెప్పడంతో ధర్మాసనం పైవిధంగా ఉత్తర్వులు ఇచ్చింది. వరవరరావును పోలీసులు అదుపులోకి తీసుకోడానికి కారణం చెప్పలేదనీ, మహారాష్ట్రలోని భీమా–కోరేగావ్‌లో గత జనవరిలో జరిగిన అల్లర్లకు వరవరరావుకు సంబంధం లేదని, ఆ కేసులో ఆయన పేరు కూడా లేదని సురేష్ ధర్మాసనానికి చెప్పారు. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. -
కోర్టు ఆదేశిస్తేనే ఎఫ్ఐఆర్ నమోదా..?
పోలీసులపై హైకోర్టు ఆగ్రహం ఎస్సైకు రూ. 15 వేలు జరిమానా సాక్షి, హైదరాబాద్: తీవ్రమైన (కాగ్నిజబుల్) నేరాల్లోనూ బాధితుల ఫిర్యాదుతో ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటే తప్ప ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదని మండిపడింది. ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా తగిన చర్యలు చేపట్టాలని అనేక పర్యాయాలు డీజీపీకి స్పష్టమైన ఆదేశాలిచ్చినా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని అసహనం వ్యక్తం చేసింది. పోలీసుల తీరు అసహ్యం కలిగిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఫిర్యాదు చేసినా 30 రోజులపాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన హైదరాబాద్‌లోని నారాయణగూడ పీఎస్ ఎస్సై తీరును తప్పుబట్టింది. ఇందుకుగాను ఆ ఎస్సై రోజుకు రూ. 500 చొప్పున మొత్తం రూ. 15 వేలు సొంత డబ్బు బాధితునికి చెల్లించాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తీర్పునిచ్చారు. డెల్టా క్యాబ్‌కు చెందిన సాజిద్ హుస్సేన్ తనను మోసం చేశాడని ఏవీ సంతోష్‌కుమార్ 2013, నవంబర్ 11న నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో అదే నెల 16న మరోసారి పోస్టు ద్వారా ఫిర్యాదు పంపారు. దీనిపైనా పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో సంతోష్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. -
సమాజంలో అవినీతి పెచ్చరిల్లింది: జస్టిస్ నాగార్జునరెడ్డి
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి పటాన్చెరు, న్యూస్‌లైన్: సమాజంలో అవినీతి అంతర్భాగంగా మారిపోయిందని హైకోర్టు న్యాయమూర్తి సీవీ నాగార్జునరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మనుషులు నీతివంతంగా బతకడం నేర్చుకోవాలని ఉద్బోధించారు. అక్షయ పాత్ర సంస్థ ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తోంది. ఈ సంస్థ పరిధిలోని పాఠశాలలకు హైదరాబాద్ ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ సంస్థ సౌజన్యంతో శనివారం 190 కంప్యూటర్లను అందజేశారు. ఈ కార్యక్రమం మెదక్ జిల్లా పటాన్చెరు అక్షయ పాత్ర కార్యాలయంలో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ నాగార్జునరెడ్డి కంప్యూటర్లను జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్‌కు అందజేశారు.