పీఎస్ఎల్వీ-సీ 25 రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభం
సూళ్లూరుపేట సమీపంలోని శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ- సీ 25 రాకెట్ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రంగం సిద్ధం చేసింది. పీఎస్ఎల్వీ-సీ 25 రాకెట్ ప్రయోగానికి ఆదివారం ఉదయం 6.08 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది.
ఎల్లుండి మధ్యాహ్నం 2.38 నిమిషాలకు ఆ రాకెట్ నింగిలోకి దూసుకుపోతుంది. అంటే 56.30 గంటలపాటు కౌంట్ డౌన్ కొనసాగుతుంది. రూ.450 కోట్లను పీఎస్ఎల్వీ-సీ 25 రాకెట్ ప్రయోగం కోసం ఇస్రో వెచ్చించింది. ఇప్పటి వరకు 25 పీఎస్ఎల్వీ రాకెట్లను షార్ నుంచి ఇస్రో ప్రయోగించింది. అయితే 23 పీఎస్ఎల్వీలు మాత్రమే విజయవంతంగా నింగిలోకి దూసుకుపోయిన సంగతి తెలిసిందే.ఈ ప్రయోగం ద్వారా మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహాన్ని అంగారకుడి కక్ష్యలోకి పంపనుండటం తెలిసిందే.