బాబుకు పిండం పెట్టి... సీపీఐ వినూత్న నిరసన | cpi protesting in a variety manner | Sakshi
Sakshi News home page

బాబుకు పిండం పెట్టి... సీపీఐ వినూత్న నిరసన

Published Wed, Mar 18 2015 8:24 PM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

cpi protesting in a variety manner

కదిరి (అనంతపురం): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అనంతపురం జిల్లా కదిరిలో సీపీఐ నాయకులు పిండ ప్రదానం చేసి వినూత్న నిరసన తెలిపారు. స్థానిక అంబేద్కర్ కూడలిలో సీపీఐ కదిరి మండల కార్యదర్శి నాగన్న బుధవారం పిండ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్ర సర్కారును చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదు. బాబుపై కేసులను తిరగదోడతారని భయమా’’ అని ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు. కాగా, పిండ ప్రదానం చేసే సమయంలో మంత్రుల మాదిరిగా... బాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పఠించారు.

‘రైతు రుణమాఫీ స్వాహా.. డ్వాక్రా రుణాలు స్వాహా.. ఇంటికో ఉద్యోగం స్వాహా..’ అని అన్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు సైతం పిండ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఇలియాజ్, కదిరప్ప, ఇషాక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement