కాంగ్రెస్ దొంగలను చంద్రబాబు చేర్చుకున్నారు: అనంత
అనంతపురం: కాంగ్రెస్ పార్టీలోని దొంగలను తెలుగుదేశం పార్టీలో చేరారని వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలోని దొంగలను చంద్రబాబు పార్టీలో చేర్చుకుని అదే బలమని అనుకుంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన పాపం టీడీపీ,కాంగ్రెస్,బీజేపీలదేనని ఆయన ఆరోపించారు.
అనంతపురం జిల్లా గుత్తిలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు అనంత వెంకట్రామిరెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ, కాంగ్రెస్ నుంచి 500 మంది కార్యకర్తలు అనంత వెంకట్రామిరెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు.