లాటరీల పేరుతో మోసం చేస్తున్న ముఠాను పోలీసులు సాయంత్రం అరెస్ట్ చేశారు.
రామకుప్పం(చిత్తూరు): లాటరీల పేరుతో మోసం చేస్తున్న ముఠాను పోలీసులు సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.
వివరాలు.. తమిళనాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులు బృందంగా ఏర్పడి లాటరీల పేరుతో రామకుప్పం మండలంలో 500 మంది నుంచి డిపాజిట్‌లు సేకరించారు. అయితే లాటరీలు మాత్రం బినామీలకే దక్కుతున్నాయి. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.