కలెక్టరేట్/వేల్పూర్/డిచ్‌పల్లి/పెర్కిట్/ సదాశివనగర్, న్యూస్‌లైన్ : నీలం తుపాను వస్తే ఆగమేఘాల మీ ద సీమాంధ్ర ప్రాంతాలకు పరుగెత్తిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తెలంగాణలో జరిగిన నష్టం కనపడలేదా అని టీఆర్‌ఎస్ ఎమ్యెల్యేలు ప్రశ్నించారు. సోమవారం నిజామాబాద్ నగరంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీం దర్‌రెడ్డి, గంపగోవర్ధన్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు జోగురామన్న, వేణుగోపాలాచారి విలేకరులతో మాట్లాడారు.
కేసీఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్,ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించామని తెలిపారు. పంట నష్టంపై పూర్తినివేదికలు రూపొందించి గవర్నర్, సీఎస్, జిల్లా కలెక్టర్‌కు అందిస్తామన్నారు. నాలుగేళ్లుగా వడగండ్ల వానకు చేతికొచ్చిన పంటలు దెబ్బతింటున్నాయన్నారు. జిల్లాలో బాల్కొండ మొదలుకొని ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ ప్రాం తాల్లో పంటనష్టం ఎక్కువగా జరిగిందన్నారు. ఆర్మూర్‌లో పసుపు, మొక్కజొన్న పూర్తిగా నీట మునిగిందన్నారు. సీమాంధ్ర ప్రాంతాల్లో ము నిగిన పంట వివరాలను ఆగమేఘాల మీద వ్యవసాయాధికారులు సేకరిస్తుంటే, తెలంగాణలో మాత్రం ఇంకా అధికారుల కదలిక లేదన్నారు.
తడిసిన ధాన్యాన్ని, మొక్కజొన్న, సోయాను ప్రభు త్వమే కొనుగోలు చేయాలన్నారు. ఇప్పటి వరకు తాము పరిశీలించిన మూడు మండలాలలో రూ. 20 కోట్ల పంటనష్టం జరిగిందన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి రైతులకు పంట నష్టం పరిహారాన్ని చెల్లించాలన్నారు. సీమాంధ్ర ప్రాంతాల వారికి పిడుగుపాటుకు, పంటనష్టానికి ఒక నీతి,తెలంగాణ ప్రాం తాల ప్రజలకు మరో నీతిని సీఎం మానుకోవాల న్నా రు.అనంతరం తడిసిన ధాన్యం, మొక్కజొన్నను తీసుకువచ్చి కలెక్టర్ ప్రద్యుమ్నకు చూపించారు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం
జిల్లాలో కోనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని కలెక్టర్ ప్రద్యుమ్న ఎమ్మెల్యేలతో పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. మొక్కజొ న్న విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి నిబంధనలు రాలేదన్నారు. రైతులకు బీమా చెల్లింపు విషయంలో ఎల్‌డీఎం, బ్యాంకు మేనేజర్లను పిలిపిం చి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచిస్తామన్నారు.
పెట్టుబడులు పెరిగాయి
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సోమవారం వేలూర్ మండ లం మోతె, ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్, సదాశివనగర్ మండలం, బాల్కొండ, డిచ్‌పల్లి మండలం సుద్దులం గ్రామాలను సందర్శించారు. వర్షాలకు నేల వాలిన వరి, దుంపకుళ్లు సోకిన పసుపు పంటలను పరిశీలించారు. పసుపు పంట పెట్టుబడి ఎకరానికి రూ. లక్షకు పెరిగిందని, క్వింటాలుకు రూ. 35 వేలు చెల్లిస్తే తప్ప పసుపు రైతుకు గిట్టుబాటు కాదన్నారు. బంగారంతో సమానమైన పసుపు పంటకు బంగారానికి ఉన్న ధరను వర్తింపజేయా లని డిమాండ్ చేశా రు. తెలంగాణలో తీవ్రంగా నష్టపోయిన రైతులకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనం విరాళం గా ఇస్తున్నట్లు చెప్పారు.
సీమాంధ్రలో కల్తీసారా తాగి ఎవరైనా చనిపోతే సీమాంధ్ర నేతలు హుటా హుటిన వెళ్లి పరామర్శిస్తారని, తెలంగాణలో పంటలు నష్టపోయి సుమారు 150 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఒక్కరూ పరామర్శించలేదని ధ్వజ మెత్తార ు. జిల్లాలో పంట నష్టం జరిగినప్పటికీ రెవెన్యూ అధికారులు, వ్యవసాయాధికారులు ఇప్పటి కీ పరిహా రం అంచనా వేయలేదన్నారు. ఎమ్మెల్యేల వెంట డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దిన్, జిల్లా ఇన్‌చార్జి కరిమెల్ల బాబూరావు, నిజామాబాద్ రూరల్ ఇన్‌చార్జి డాక్టర్ భూపతిరెడ్డి, ఆర్మూర్ ఇన్‌చార్జి జీవన్‌రెడ్డి, పొలిట్ బ్యూరోసభ్యులు ఏఎస్ పోశెట్టి, అర్బన్ ఇన్‌చార్జి బస్వాలక్ష్మీనర్సయ్య తదితరులు ఉన్నారు.
తెలంగాణ రైతు గోస పట్టదా?
Published Tue, Oct 29 2013 6:10 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement