సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘ఫొని’ తుపాన్ ఉత్తర కోస్తా వైపు దూసుకోస్తుంది. మే 2 నుంచి ఫొని ఉత్తరాంధ్రపై ప్రభావం చూపనుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 840 కి.మీ దూరంలో, మచిలీపట్నానికి 990 కి.మీ దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉంది. ఫొని మంగళవారం లేదా బుధవారం అతి తీవ్ర తుపాన్‌గా మారనుంది. తుపాన్ ప్రభావంతో దక్షిణ కోస్తాలో మంగళవారం నుంచి తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. మే 3వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో అధికారులు అన్ని ప్రధాన పోర్టులో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment