తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది: కృష్ణారావు
హైదరాబాద్: 'హధూద్' తుఫాన్ పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి వైఆర్ కృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొనాలని కృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు.
సహాయక చర్యల కోసం ఎనిమిది హెలికాఫ్టర్లు సిద్దం చేశామని, వాటిని వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. విశాఖపై తుఫాన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని అధికారులను కృష్ణారావు హెచ్చరించారు.