Cyclone hudood
-
స్తంభించిన జన జీవనం
విజయనగరం మున్సిపాలిటీ : హుదూద్ తుపాను ధాటికి జన జీవనం స్తంభిం చింది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉపద్రవం ముంచుకొస్తుందన్న ముందస్తు సమాచారంతో శనివారం అన్ని విద్యాసంస్థలకు జిల్లా విద్యాశాఖ సెలవు ప్రకటించింది. సోమవారం కూడా పాఠశాలలు తెరుచుకునే పరిస్థితి లేదు. ఉద్యోగులు తమ కార్యకలాపాల కోసం కార్యాలయాల కు వెళ్లే పరిస్థితి లేదు. కార్మికులు, కర్షకులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఇళ్లకే పరిమి తమయ్యారు. ఆదివారం అర్ధరాత్రి వర కు గాలులు వీయడంతో ఎవరెక్కడున్నారన్న సమాచారం కూడా కానరాలేదు. మరోవైపు నిత్యం ప్రయాణికుల రద్దీతో కళకళలాడే విజయనగరం రైల్వేస్టేషన్, బస్స్టేషన్లు వెలవెలబోయాయి. నాసా, ఇస్రో వంటి సంస్థల తుపాను హెచ్చరిక ల నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే శాఖతో పాటు తూర్పుకోస్త రైల్వే శాఖ అధికారు లు జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు. అలాగే జిల్లా నుంచి ఇతర జిల్లాలతో పాటు జి ల్లాలోని పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ఆర్టీసీ సేవలను శనివారం అర్ధరాత్రి నుంచి నిలిపివేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల్లోనూ ఇదే పరిస్థితి కనిపిం చింది. పట్టణ పరిసర ప్రాంతాల్లో నిత్యం రద్దీగా తిరిగే ఆటోలు కూడా నిలిచిపోయూయి. -
అలజడి
సాక్షి, చెన్నై: రాష్ట్రానికి హుదూద్ గండం తప్పడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడడంతో తీరప్రాంత వాసులు కొంత ఆందోళన చెం దారు. విశాఖపట్టణం, ఒడిశాలకు చెన్నై నుంచి వెళ్లాల్సిన విమాన సేవలు రద్దు చేశారు. అండమాన్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం తుపాన్‌గా మారింది. దీనికి హుదూద్ అని నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఈ తుపాన్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని తొలి నుంచి సమాచారం వెలువడుతోంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని సముద్ర తీరాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే తంజావూరు, తిరువారూర్, నాగపట్నం తదితర డెల్టా జిల్లాల్లో వర్షాలు పడడంతో ఆ ప్రభావం కొంతమేరకు తమిళనాడు మీద ఉండొచ్చన్న భావన సర్వత్రా బయలుదేరింది. ఈ నేపథ్యంలో సముద్ర తీర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత వాసులను, జాలర్లను అప్రమత్తం చేశారు. శనివారం నాగపట్నం తీరంలో అలల తాకిడి క్రమంగా పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. నాగపట్నం, పాంబన్, పుదుచ్చేరి హార్బర్లలో రెండో ప్రమాద హెచ్చరికను ఎగుర వేశారు. జాలర్లను సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. హుదూద్ ప్రభావంతో భారీ వర్షం పడిన పక్షంలో లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలకు సర్వం సిద్ధం చేశారు. ఈ క్రమంలో ముందుగా ప్రకటించినట్టే హుదూద్ విశాఖపట్టణం సమీపంలో తీరం దాడడంతో ఇక్కడి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ ప్రభావంతో సముద్ర తీరాల్లో ఎలాంటి వర్షాలు పడలేదు. అక్కడక్కడా చిరు జల్లులు పడ్డాయి. కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడడం ఆందోళన కలిగించింది. తిరువళ్లూరు జిల్లా పలవేర్కాడు, చెన్నైలోని ఎన్నూరు, నుంచి కడలూరు, నాగపట్నం, రామనాథపురం, తూత్తుకుడి, కన్యాకుమారి వరకు అలలు ఉవ్వెత్తున ఎగసి పడ్డాయి. తమిళనాడులో పెరటాశి నెలలో సముద్రం వెనక్కు తగ్గడం సహజం. హుదూద్ ప్రభావంతో అలలు మరింతగా ఎగసి పడడంతో వాటిని చూడడానికి జనం సముద్ర తీరాల బాట పట్టారు. సముద్రానికి సమీపంలోకి వెళ్లడానికి భద్రతా సిబ్బంది ఎవ్వరినీ అనుమతించలేదు. పది నుంచి పదిహేను అడుగుల మేరకు అలలు ఎగసి పడడంతో జాలర్లు సైతం ఆందోళన చెందారు. తమ చిన్న చిన్న పడవల్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చుకున్నారు. కన్యాకుమారి తీరంలో అలల తాకిడి పర్యాటకులకు ప్రత్యేక కనువిందుగా మారింది. హుదూద్ ప్రభావంతో తమిళనాడుకు ఎలాంటి ముప్పు వాటిళ్ల లేదని, ఆకాశం మేఘామృతంగా ఉందని, పలుచోట్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. విమాన సేవల రద్దు : విశాఖపట్టణం సమీపంలో హుదూద్ తీరం దాటడంతో అక్కడ అల్లకల్లోలం చోటుచేసుకుంది. చెన్నై నుంచి ఉదయాన్నే విశాఖపట్టణం వెళ్లాల్సిన ఇండిగో, ఎయిర్ కోటెస్తో పాటు మరో విమానాన్ని రద్దు చేశారు. హుదూద్ ప్రభావం ఒడిశాను సైతం తాకడంతో అక్కడికి చెన్నై నుంచి వెళ్లాల్సిన మూడు విమానాల్ని రద్దు చేశారు. ప్రయాణికులకు ఎస్ఎంఎస్ ద్వారా, ఫోన్ల ద్వారా ముందుగానే సమాచారం అందించారు. విమాన సేవలు రద్దు చేశామని, విశాఖపట్టణం, ఒడిశాలో పరిస్థితులకు అనుగుణంగా సోమవారం విమాన సేవలను పునరుద్ధరిస్తామని మీనంబాక్కం వర్గాలు ప్రకటించాయి. -
గంగమ్మ తల్లీ ... గండం గట్టెక్కించు!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : హుదూద్ పెను తుపానై దూసుకొస్తోంది. సముద్రం ఉగ్రరూపం దాల్చింది. అలలు అంతెత్తున ఎగిసిపడుతున్నాయి. కెరటాలు తీరప్రాంత గ్రామాల్లోని ఇళ్ల గోడలకు తాకుతున్నాయి. మునుపెన్నడూలేని విధంగా పరిస్థితులు కన్పిస్తుండడంతో మత్స్యకార గ్రామాలు వణికిపోతున్నాయి. తుపాను వల్ల జరిగే నష్టాన్ని తలచుకుంటూ జిల్లా ప్రజలు బెంబేలెత్తిపో తున్నారు. ఈ కష్టం నుంచి కాపాడమని కని పించిన దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. మత్స్యకారులు గంగమ్మతల్లినే నమ్ముకున్నారు. కూడు పెట్టిన నీవే ఇలా ఉగ్రరూపం దాల్చితే తామేమైపోవాలని వేడుకొంటున్నారు. శాంతి కరుణించాలని మొక్కుకుంటున్నారు. ఇళ్లను తాకిన అలలు శనివారం నుంచి సముద్రం అల్లోకల్లలంగా కనిపించింది. నాలుగైదు మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. 30 నుంచి 40 అడుగుల మేర కెరటాలు దూసుకొచ్చాయి. ఎప్పడూలేని విధంగా గ్రామాల్ని తాకాయి. పూసపాటిరేగ మండలం తిప్పవలస వద్ద సముద్రం దాదాపు 40 అడుగుల ముందుకొచ్చింది. పతివాడ బర్రిపేట కూడా కెరటాల తాకిడికి గురైంది. దీంతో సముద్రం ఒడ్డున లంగరు వేసిన 70 పడవలు చిక్కుకున్నాయి. వాటిలో విలువైన వలలు ఉన్నాయి. వాటిని గ్రామంలోకి తీసుకువచ్చేందుకు యత్నించిన మత్స్యకారులు విఫలమయ్యారు. భోగాపురం మండలం ముక్కాం, చేపలకంచేరులో సముద్రం దూసుకొచ్చి ఇళ్ల గోడలను తాకింది. ముక్కాంలో 180 పూరిళ్లు ఉండడంతో పెనుగాలికి ఎగిరిపోయే ప్రమాదం ఉండడంతో ఎప్పుడేప్రమాదం చోటు చేసుకుంటుందోనని వారంతా భయపడుతున్నారు. హుదూద్ ప్రభావంతో వీస్తున్న బలమైన ఈదురు గాలులకు చెట్లు ఊగిపోతున్నాయి. చెట్లు,విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉంది. అందుకు తగ్గట్టుగా పునరుద్ధరణ చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పొంగి ప్రవహిస్తున్న నాగావళి ఒడిశా, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో నాగావళిలో నీటి ప్రవాహం పెరిగింది. క్రమేపి పోటెత్తే అవకాశం ఉండటంతో పార్వతీపురం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. అధికారులు ఇప్పటికే ఆమేరకు అప్రమత్తమయ్యారు. తుపాను ప్రభావంతో కనిష్టంగా ఆరు సెంటీమీటర్ల నుంచి గరిష్టంగా 26సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే ఆస్కారం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇళ్లు వదలబోమంటున్న మత్స్యకారులు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని, ముప్పు ఉన్న మత్స్యకార గ్రామాల ప్రజ ల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రత్యేక ఆదేశాలొచ్చాయి. అం దుకు తగ్గట్టుగా 12పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 15 వేల మందికి సరిపడా వసతుల్ని కల్పించారు. కానీ మత్స్యకారులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. తుపానులు కొత్తేమి కాదని, ఉన్న ఊరిని, సొం తిళ్లు వదిలి కదిలేది లేదని మత్స్యకారులు మొండికేస్తున్నారు. గంగమ్మే చూసుకుంటుందని అంటున్నారు. దీంతో అధికారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తప్పని పరిస్థితుల్లో కొందర్ని బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. శనివారం సాయంత్రానికి అతి కష్టం మీద నాలుగు వేల మందిని తరలించారు. కానీ వారంతా భోజనం చేసేసి మళ్లీ ఇళ్లకు వెళ్లిపోతున్నారు. తీర ప్రాంతానికి ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బలగాలు చేరుకున్నాయి. పది మంది చొప్పున గ్రూపుగా ఏర్పడి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గ్రామాలలో మొహరించారు. ఆర్మీ బలగాలు సహాయకచర్యలకు సిద్ధమయ్యాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. -
సిద్ధంగా ఉన్నాం
విజయనగరం కంటోన్మెంట్: హుదూద్ తుపానువల్ల ఎదురయ్యే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ ఎంఎం నాయక్ చెప్పారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్సు హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనమాట్లాడారు. తీర ప్రాంత మండలాలైన భోగాపురం, పూసపాటి రేగల్లో గుర్తించిన 22 గ్రామాల్లో తొమ్మిది గ్రామాలపై ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని, ఈ గ్రామాల్లో ఉన్న మత్స్య కారులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని చెప్పారు. 14 మైనర్ ఇరి గేషన్ చెరువులు దెబ్బతినే అవకాశముందని వాటికి గండ్లు పడితే పూడ్చేందుకు సిబ్బందిని నియమించామన్నారు. మంచినీటి సరఫరాకు తగు చర్యలు తీసుకున్నామని తెలిపారు. 12 పునరావాస కేంద్రాలకు ఇప్పటికే నాలుగు వేల మందిని తరలించామని చెప్పారు. వీరిలో కొందరు మళ్లీ ఇళ్లకు వెళ్లిపోతున్నారని, రానున్న మూడు రోజులు మత్స్య కారులు పునరావాస కేంద్రాలను విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాకు వచ్చిన 40 మంది జాతీయ విపత్తు నివారణ, రక్షణ సిబ్బందిని జట్టుకు పది మంది చొప్పున నాలుగు బృందాలుగా విభజించి ముప్పు ఉన్న ప్రాంతాలకు తరలించినట్టు చెప్పారు. 15 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు నాయక్ తెలిపారు. అవసరాన్ని బట్టి పోలీసు సహాయాన్ని తీసుకుంటామన్నారు. ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం, పడిపోయిన చెట్లను వెంటనే అక్కడ నుంచి తరలించే చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు ఆర్అండ్ బీ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పాడయితే వెంటనే బాగుచేసేందుకు, కొత్తవాటిని ఏర్పాటు చేసేందుకు విద్యుత్ శాఖాధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లా యంత్రాంగమంతా 24గంటలూ అందుబాటులో ఉండే చర్యలు తీసుకుంటున్నామన్నారు. విపత్కర పరిస్థితుల్లో 1949 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోను చేసి సమాచారమందిస్తే యుద్ధప్రాతిపదిక సహాయక చర్యలు చేపడతామని తెలిపారు. తుఫాను ప్రత్యేకాధికారి పి.ఏ. శోభ, ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
గజగజ
ఏలూరు:తీరం వైపు మహోగ్రంగా దూసుకొస్తున్న హుదూద్ పెను తుపాను జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలను వణికిస్తోంది. ఏ క్షణాన ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందోనన్న ఆందోళన ప్రజలను, అధికారులను కలవరపెడుతోంది. జిల్లా యంత్రాం గం నష్ట నివారణ చర్యల్లో నిమగ్నమైంది. విశాఖ పట్నం నుంచి 36 మంది సభ్యులు గల కోస్టుగార్డు బృందం, గుంటూరు నుంచి 40 మంది సభ్యులు గల జాతీయ విపత్తుల నివారణ (ఎన్డీఆర్ఎఫ్) బృందం జిల్లాకు చేరుకున్నారుు. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నరసాపురం, మొగల్తూరు మండలాలపై యంత్రాం గం ప్రత్యేక దృష్టి సారించింది. ఆ రెండు మండలాల్లో 14 పునరావాస కేంద్రాలను, కాళ్ల, భీమవరం, యల మంచిలి మండలాల్లో 9 కేంద్రాలను ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి 5,045 మందికి పునరావాసం కల్పించారు. సీఎం ఆరా తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో జిల్లాలో చేపట్టిన చర్యలపై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. కలెక్టర్ కె.భాస్కర్‌తో మాట్లాడిన ఆయన ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దీటుగా ఎదుర్కోవాలని ఆదేశించారు. ఇదిలావుండగా, అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు తీర గ్రామాల్లోనే మకాం వేశారు. నరసాపురం మండలంలో సముద్ర తీర గ్రామాలైన వేములదీవి తూర్పు, పడమర, పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు, బియ్యపుతిప్ప గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ గ్రామాల్లో ఏర్పాట్లను జెడ్పీ సీఈవో డి.వెంకటరెడ్డి, ఆర్డీవో పుష్పమణి, డీహెఎంహెచ్వో శంకరరావు పర్యవేక్షిస్తున్నారు. కేపీ హైస్కూల్, పేరుపాలెం హైస్కూల్లో శనివారం రాత్రి భోజనం ఏర్పాట్లు చేశారు. జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు ఆ గ్రామాలను సందర్శించారు. ప్రతి గ్రామానికి మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. తీర గ్రామాల్లో మంత్రి సుజాత,కలెక్టర్ పర్యటన నరసాపురం మండలంలోని తీర గ్రామా ల్లో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, కలెక్టర్ కె.భాస్కర్ శని వారం పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుపాను ఆదివారం మధ్యాహ్నం తీరం దాటుతుందని, ఆ సమయంలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ దృష్ట్యా గుడిసెలు, పాకల్లో నివాసం ఉంటున్న వారిని బలవంతంగానైనా పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. పెదమైనవాని లంకలో సముద్రం కోతకు గురైన ప్రాంతాన్ని మంత్రి పీతల సుజాత పరిశీ లించారు. ప్రజలు ఎటువంటి ప్రమాదాలకు లోనుకాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైళ్లు, బస్సులు రద్దు హుదూద్ తుపాను తీవ్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే అధికారులు విశాఖ వైపు వెళ్లే, అటు నుంచి వచే అన్ని రైళ్లను శనివారం అర్ధరాత్రి నుంచి రద్దు చేశారు. చెన్నై, హౌరా ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లిం చారు. జిల్లా మీదుగా వెళ్లే 15 ఎక్స్‌ప్రెస్ రైళ్లను నుంచి నిలిపివేశారు. గోదావరి, రత్నాచల్, లింక్, బొకారో, తిరుమల తదితర రైళ్లు రద్దయ్యూరుు. విజయవాడ-రాయగడ, రాయగడ-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను సైతం రద్దు చేశారు. హౌరా వైపు వెళ్లే ఫలక్‌నుమా, చెన్నై ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లించారు. ఉదయం 8.25 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరే విశాఖపట్నం రైలును రాజ మండ్రి వరకే నడపాలని నిర్ణయించారు. జిల్లాలోని ఆరు ఆర్టీసీ డిపోల నుంచి విశాఖపట్నం వెళ్లే బస్సులను శనివారం రద్దు చేశారు. ఆదివారం బస్సులను నడిపేది లేనిది అప్పటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని రీజినల్ మేనేజర్ ఆర్.రామారావు తెలిపారు. రైల్వే స్టేషన్లలోనూ ఏర్పాట్లు రైళ్ల రాకపోకలు, రద్దు తదితర వివరాలను తెలుసుకునేందుకు ఏలూరు పెద్ద రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన 08812-232267కు ఫోన్ చేయూలని స్టేషన్ మేనేజర్ ఐ.ప్రభాకరరావు సూచించారు. రద్దయిన రైళ్లలో టికెట్లు తీసుకున్న ప్రయూణికులకు సొమ్మును వెనక్కి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏవైనా రైళ్లు ఏలూరు సమీపంలోకి వచ్చాక రద్దు చేయూల్సి వస్తే వాటిలోని ప్రయూణికులకు భోజనం, పిల్లలకు పాలు అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. జాగ్రత్త సుమా! తుపాను వల్ల తీర గ్రామాల్లో ఏ ఒక్కరికీ ప్రాణహాని లేకుండా చూడాలని కలెక్టర్ కె.భాస్కర్ అధికారులను ఆదేశించారు. తుపాను పరిస్థితులపై శనివారం రాత్రి మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ఎవరికైనా ప్రాణహాని జరిగితే అందుకు సంబంధిత అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. శనివారం అర్ధరాత్రి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున్న లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. అవసరమైతే ప్రజాప్రతినిధులు, పోలీసుల సహకారం తీసుకుని బలవంతంగానైనా తరలించాలని ఆదేశించారు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకూ అధికారులెవరూ తమ కార్యస్థానాలను విడిచి వెళ్లొద్దన్నారు. జాయింట్ కలెక్టర్ టి.బాబురావునాయుడు మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో గర్భిణులు, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్నారు. వీలైనంత వరకూ పురుషులు, మహిళలకు వేర్వేరుగా వసతి కల్పించేలా చూడాలన్నారు. గోదావరి, ఎర్రకాలువ, తమ్మిలేరు పరీవాహక ప్రాంతాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. శెట్టిపేట సమీపంలోని గ్రామాలు, భీమవరంలో యనమదుర్రు డ్రెరుున్ పక్కన మురికివాడలు, మొగల్తూరు మండలంలోని కేపీ పాలెం, మోళ్లపర్రు, నరసాపురం మండలంలోని చినమైనవానిలంక, పెదమైనవానిలంక ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండేలా చూడాలన్నారు. కాన్ఫరెన్స్‌లో డీఆర్వో కె.ప్రభాకరరావు, డీఆర్డీఏ పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, సీపీవో సత్యనారాయణ, గృహనిర్మాణ సంస్థ పీడీ శ్రీనివాసరావు, సెట్వెల్ సీఈవో సుబ్బారావు, ఐసీడీఎస్ పీడీ వి.వసంతబాల పాల్గొన్నారు. -
హుదూద్ తుఫాన్ పై ఏపీ సిఎస్ సమీక్ష
-
తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది: కృష్ణారావు
హైదరాబాద్: 'హధూద్' తుఫాన్ పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి వైఆర్ కృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొనాలని కృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యల కోసం ఎనిమిది హెలికాఫ్టర్లు సిద్దం చేశామని, వాటిని వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. విశాఖపై తుఫాన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని అధికారులను కృష్ణారావు హెచ్చరించారు.