
స్తంభించిన జన జీవనం
విజయనగరం మున్సిపాలిటీ : హుదూద్ తుపాను ధాటికి జన జీవనం స్తంభిం చింది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉపద్రవం ముంచుకొస్తుందన్న ముందస్తు సమాచారంతో శనివారం అన్ని విద్యాసంస్థలకు జిల్లా విద్యాశాఖ సెలవు ప్రకటించింది. సోమవారం కూడా పాఠశాలలు తెరుచుకునే పరిస్థితి లేదు. ఉద్యోగులు తమ కార్యకలాపాల కోసం కార్యాలయాల కు వెళ్లే పరిస్థితి లేదు. కార్మికులు, కర్షకులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఇళ్లకే పరిమి తమయ్యారు. ఆదివారం అర్ధరాత్రి వర కు గాలులు వీయడంతో ఎవరెక్కడున్నారన్న సమాచారం కూడా కానరాలేదు. మరోవైపు నిత్యం ప్రయాణికుల రద్దీతో కళకళలాడే విజయనగరం రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్లు వెలవెలబోయాయి. నాసా, ఇస్రో వంటి సంస్థల తుపాను హెచ్చరిక ల నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే శాఖతో పాటు తూర్పుకోస్త రైల్వే శాఖ అధికారు లు జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు. అలాగే జిల్లా నుంచి ఇతర జిల్లాలతో పాటు జి ల్లాలోని పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ఆర్‌టీసీ సేవలను శనివారం అర్ధరాత్రి నుంచి నిలిపివేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని ఆర్‌టీసీ డిపోల్లోనూ ఇదే పరిస్థితి కనిపిం చింది. పట్టణ పరిసర ప్రాంతాల్లో నిత్యం రద్దీగా తిరిగే ఆటోలు కూడా నిలిచిపోయూయి.