దర్శి, న్యూస్‌లైన్: డ్వాక్రా మహిళలందరికీ రుణమాఫీ చేయాలంటే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమని దర్శి నియోజకవర్గ సమన్వయకర్త, తాజా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. దర్శిలో పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లు పరిశీలించేందుకు వచ్చిన ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. సోనియాగాంధీ తన కొడుకు రాహుల్‌ను ప్రధాని చేసేందుకే రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీసుకుందన్నారు.
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా రెండుసార్లు నిరవధిక నిరాహార దీక్షలు చేసినా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టీడీపీలను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ సబ్సిడీ సిలిండర్‌కు * 50 ఇస్తే, జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే * 100 ఇస్తానని కడప ప్లీనరీలో చెప్పినట్లు ఆయన తెలిపారు.
మహిళలు, రైతుల సమస్యలు తెలుసుకున్న నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనన్నారు. కార్యక్రమంలో ఉడుముల వెంకటరెడ్డి, జింకల సుబ్బరామిరెడ్డి, వెన్నపూస రామిరెడ్డి, వేమిరెడ్డి చెన్నారెడ్డి, మిల్లర్ బుజ్జి, పులిపాడు సర్పంచ్ వడితే రామానాయక్, భవనం శ్రీనివాసరెడ్డి, కేసరి రాంభూల్‌రెడ్డి, అచ్చారావు, బండి గోపాల్, కుందురు నరసింహారెడ్డి పాల్గొన్నారు.
డ్వాక్రా మహిళల రుణమాఫీ జగన్‌కే సాధ్యం
Published Sun, Feb 9 2014 3:58 AM | Last Updated on Mon, Aug 27 2018 8:57 PM
Advertisement