డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మంగళవారం ప్రకటించాల్సిన సీట్ల కేటాయింపు జాబితా ప్రకటన నిలిచిపోయింది.
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మంగళవారం ప్రకటించాల్సిన సీట్ల కేటాయింపు జాబితా ప్రకటన నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో జాబితాను ప్రకటించలేదని డైట్‌సెట్ కన్వీనర్ సురేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఒకటి రెండు రోజుల్లో సీట్ల కేటాయింపు జాబితాను ప్రకటిస్తామన్నారు. మైనారిటీ కాలేజీలు మైనారిటీ కోటాలోనే సీట్లను భర్తీ చేసుకోవాలా? లేక కన్వీనర్ కోటాలో భర్తీ చేసేందుకు అంగీకరించాలా? అనే విషయంలో విద్యాశాఖ ఇచ్చిన గడువు సరిపోదంటూ ఒక మైనారిటీ కాలేజీ యాజమాన్యం కోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం తలెత్తినట్లు తెలిసింది. విద్యాశాఖ సూచనల ఆధారంగా జాబితాను ప్రకటిస్తామని డైట్‌సెట్ వర్గాలు పేర్కొన్నాయి.