బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని విశాఖపట్నంలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం శుక్రవారం వెల్లడించింది. తమిళనాడులోని నాగపట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తమిళనాడు, పాండిచ్చేరిలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వాయుగుండం తీరం దాటే సమయంలో 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అయితే వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా పయనించి... వేదారణ్యం - పంబన్ల మధ్య తీరందాటే అవకాశం ఉందని పేర్కొంది. మాది తుపాన్ మళ్లీ బలహీనపడి వాయుగుండంగా మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని తుపాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.