
సాక్షి, అమరావతి: కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌తో ఎక్సైజ్, వాణిజ్య పన్నుల ద్వారా రూ.6 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఆదాయం తగ్గిన.. సీఎం వైఎస్ జగన్ లాక్‌డౌన్‌కు కఠినంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఆదాయం లేకపోయిన పేదలకు రేషన్, ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చుని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు.
(కుటుంబ సర్వే ఆధారంగా పరీక్షలు: సీఎం జగన్)
ఇంగ్లీష్ మీడియాన్ని చంద్రబాబే అడ్డుకున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టుకు వెళితే చంద్రబాబు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు వల్లే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతోందని నిప్పులు చెరిగారు. వాలంటీర్ల వ్యవస్థతో దేశంలోనే బెస్ట్ సీఎంగా వైఎస్ జగన్ నిలిచారని నారాయణస్వామి పేర్కొన్నారు.
(మనవడితో ఆడుకోక.. ఈ చిటికెలెందుకు?’)
Comments
Please login to add a commentAdd a comment