
సాక్షి, విశాఖపట్నం: ‘లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న పేదలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.వెయ్యి సాయం అందించే కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొంటే తప్పేమిటి? దీన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేయాలా?’ అని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలపై సోమవారం విశాఖలోని జిల్లా ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తర్వాత మీడియాతో బొత్స ఏం మాట్లాడారంటే..
► విపత్కర పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రజలకు అండగా ఉంటుంటే చంద్రబాబుకు ఎందుకు తప్పుగా కనిపిస్తుందో మాకు అర్థం కావట్లేదు.
► నిరుపేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.వెయ్యి చొప్పున సాయాన్ని అందించే కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు.. అంతేతప్ప ఎవరినీ ఓట్లు అడగట్లేదు.
► ఇలాంటి క్లిష్ట సమయాల్లోనూ, ప్రజలకు అండగా ఉండాల్సిన సమయంలో చంద్రబాబు నీచ రాజకీయాలు చేయడం దారుణం.
Comments
Please login to add a commentAdd a comment