
రికార్డుల దేవిశ్రీ
లింబో స్కేటింగ్‌లో తిరుపతికి చెందిన నాలుగో తరగతి విద్యార్థి దేవిశ్రీప్రసాద్ (8) మరో రెండు ప్రపంచ రికార్డులు సృష్టించాడు.
తిరుపతి: లింబో స్కేటింగ్‌లో తిరుపతికి చెందిన నాలుగో తరగతి విద్యార్థి దేవిశ్రీప్రసాద్ (8) మరో రెండు ప్రపంచ రికార్డులు సృష్టించాడు. తొలుత సుమోల కింద స్కేటింగ్ చేసి రికార్డు సృష్టించిన బాలుడు గురువారం ఉదయం మరోసారి సాహసోపేతమైన విన్యాసం చేపట్టాడు. అండర్ బార్స్ ఫార్వార్డ్ (ముందుకు) లోయస్ట్, లాంగెస్ట్ లింబో స్కేటింగ్‌లో 113 కమ్మీల కింద 8.2 అంగుళాల ఎత్తులో 102 మీటర్ల దూరాన్ని 15.3 సెకన్లలో చేరుకుని ప్రపంచ రికార్డు సృష్టించాడు.