రాయనపాడు స్టేషన్‌లో ప్రయాణికులకు వీడ్కోలు పలుకుతున్న డీజీపీ
సాక్షి, అమరావతి: ‘హలో.. హ్యాపీ జర్నీ.. స్వస్థలాలకు వెళ్తున్న మీకంతా సంతోషమే కదా? శ్రామికులకు సౌకర్యంగానే ఉందా?.. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు మళ్లీ ఆనందంగా తిరిగి రావాలి.. మీ అందరి కోసమే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు’ శ్రామిక్ రైలు ప్రయాణికులకు డీజీపీ దామోదర్ గౌతమ్ సవాంగ్ ఆత్మీయ పలకరింపు ఇది. ఆయన మీడియాతో మాట్లాడుతూ..
► లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన శ్రామికులను తరలించడం, ఏపీకి రప్పించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.
► ఇప్పటివరకు 31 శ్రామిక రైళ్లను ఏర్పాటు చేశాం. మరో 22 రైళ్లు నడిపేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నాం.
► లాక్‌డౌన్‌తో ఏపీలో చిక్కుకున్న ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారికోసం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైలును డీజీపీ సవాంగ్, విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదివారం రాత్రి ప్రారంభించారు. విజయవాడలోని రాయనపాడు స్టేషన్ నుంచి బయలు దేరిన ఈ రైలులో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 1,760 మంది శ్రామికులు, విద్యార్థులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment