అభ్యర్థులు గమనించాల్సిన అంశాలు
విజయనగరం అర్బన్ : ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల17, 18, 19వ తేదీల్లో ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. జిల్లాలోని కోస్టల్ ఇన్‌స్టిట్యూట్ ఇంజినీరింగ్ కళాశాల (వీరభద్రపురం, కొత్తవలస), సత్యా ఇంజినీరింగ్ కళాశాల (గాజులరేగ, విజయనగరం), లెండీ ఇంజినీరింగ్ కళాశాల (జొన్నాడ)లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డైట్ కళాశాల ప్రిన్సిపాల్ కేవీ రమణ తెలిపారు. ప్రతి కేంద్రంలోనూ ఉదయం10.00 నుంచి 12.30 గంటల వరకు, అలాగే 2.30 నుంచి 5 గంటల మధ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులకు కేటారయించిన తేదీ, సమయూలకు అనుగుణంగా పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని సూచించారు.
హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోగానే ముద్రణా తప్పిదాలు చూసుకొని సరిచేసుకోవాలి.
అభ్యర్థులకు కేటాయించిన తేదీ, సమయంలోనే పరీక్ష కేంద్రానికి హాజరుకావాలి.
హాల్ టికెట్‌లో ఇచ్చిన పాస్‌వర్ట్‌తో మీకు కేటాయించిన కంప్యూటర్‌లో మాత్రమే లాగాన్ చేసుకోవాలి.
లాగాన్ అయిన తర్వాత మానిటర్ తెరపై అభ్యర్థి వివరాలు సరిచూసుకొని ‘ఐ కన్ఫర్మ్’ లేదా ‘ఐ డీఈఎన్‌వై’ పై క్లిక్ చేయాలి.
పరీక్షకు సంబంధించిన అన్ని సూచనలను క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకున్న తర్వాత ‘బీఓఎక్స్’ను క్లిక్ చేయాలి.
సూచనలను చదివిన తర్వాత ‘ఐ యామ్ రడీ టు బిగిన్ అనే బటన్‌ను క్లిక్ చేయాలి.
ప్రశ్నలకు ఇచ్చిన నాలుగు సమాధానాల్లో సరియైన సమాధానాన్ని ఎంచుకొనుటకు మౌస్‌ను మాత్రమే వినియోగించాలి.
ఒక ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించిన తర్వాత ‘సేవ్’ క్లిక్ చేయాలి. మరో ప్రశ్నకు వెళ్లడానికి ‘సేవ్ అండ్ ఎన్‌ఈఎక్స్‌టీ’ బటన్‌ను క్లిక్ చేయాలి.
ఒక ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించిన తర్వాత మరల సరిచేసుకొనుటకు, మార్చు కొనుటకు ‘క్లియర్ రెస్పాన్స్’ బటన్‌ను క్లిక్ చేయాలి.
పరీక్ష జరుగు సమయంలో ఎప్పుడైనా సూచనలను చూడవచ్చు. సూచనలను చూసేందుకు ‘ఇన్‌స్ట్రక్షన్స్’ అనే బటన్‌పై క్లిక్ చేయాలి.
పరీక్ష పూర్తయ్యే సమయంలో ‘సబ్‌మిట్’ బటన్ క్లిక్‌చేస్తే ఏక్టివేట్ అవుతుంది. పరీక్షను ముగించుటకు ముందు మాత్రమే ఇది చేయాలి.
ఏ విధమైన సాంకేతిక సమస్యలు ఉన్నా ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకొని వెళ్లవచ్చు.
మాక్ టెస్ట్‌కి ఉచిత ‘వెబ్ సైట్’
తొలిసారిగా ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తున్న కారణంగా అభ్యర్థుల అవగాహన కోసం ప్రభుత్వం నమూనా పత్రాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ‘డీఈఈసీఈ.ఏపీ.జీఓవి.ఐఎన్’ వెబ్‌సైట్‌లో తెలుగు, ఇంగ్లిష్ విభాగాల్లో ఉన్న నమూనాపత్రాలను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కేవీ రమణ సూచించారు.
కీ బోర్డ్‌ను తాకరాదు. తాకినచో మీ ‘ఐడీ లాక్’ అవుతుంది. అలాంటి పరిస్థితిలో మీ ‘ఐడీ’ని ‘అన్ లాక్’ చేసుకోవాలి. ఇందుకోసం ఇన్విజిలేటర్‌ని సంప్రదించాలి.
పరీక్ష కేంద్రంలోనిక సెల్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు.
పరీక్ష సమయం పూర్తయ్యేవరకు పరీక్ష గదిని విడిచి వెళ్ల కూడదు.
17 నుంచి డైట్ సెట్
Published Fri, May 13 2016 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM
Advertisement
Advertisement