'జిల్లా యూనిట్ గా కేటాయింపులు' | District unit for Welfare schemes in AP, says Ravela Kishore Babu | Sakshi
Sakshi News home page

'జిల్లా యూనిట్ గా కేటాయింపులు'

Published Fri, May 1 2015 6:14 PM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

'జిల్లా యూనిట్ గా కేటాయింపులు' - Sakshi

'జిల్లా యూనిట్ గా కేటాయింపులు'

హైదరాబాద్: సంక్షేమ పథకాల అమలులో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని ఏపీ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు తెలిపారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఉపకులాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. జిల్లా యూనిట్ గా ఈ కేటాయింపులు జరుపుతామన్నారు.

ప్రస్తుతం ఉన్న 183 జీవోను సవరించి కొత్తగా జీవో 25 జారీ చేశామని వెల్లడించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎస్సీలందరూ ఐక్యంగా ఉండేందుకు ఈ పథకాన్ని చేపట్టామని రావెల వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement