రాష్ట్రం ముక్కలవుతుందనే భయంతో ప్రాణాలొదిలేస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రం ముక్కలవుతుందనే భయంతో ప్రాణాలొదిలేస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. సీమాంధ్ర జిల్లాల్లో ఆదివారం ఒక్కరోజే ఐదుగురు గుండెపోటుతో మృత్యువాత పడ్డారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆదివారం తెల్లవారుజామున ట్రెజరీశాఖ అటెండర్ బాదినేని ఆంజనేయులు(45) గుండెపోటుతో మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వర రాయపురానికి చెందిన కలగత శ్రీరాములు (70), చిత్తూరు జిల్లా గంగవరం వుండలం ఉల్లికుంట గ్రామానికి చెందిన పద్మనాభం(30) టీవీలో సమైక్య ఉద్యమ వార్తలు చూస్తూ భావోద్వేగానికి లోనై గుండెపోటుతో వుృతిచెందారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడిలో గృహిణి సిరపరపు ధనలక్ష్మి (30), నిడమర్రు మండలం పెదనిండ్రకొలనులో వ్యవసాయ కూలీ చింతా గోపి (55) విభజన వార్తలతో కలత చెంది గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.