భద్రాచలాన్ని వేరుచేస్తే ఊరుకోం: శ్రీనివాసగౌడ్
ఖమ్మం : సీమాంధ్రుల ఒత్తిడికి తలొగ్గి భద్రాచలాన్ని ఖమ్మం జిల్లా నుంచి వేరుచేయాలని చూస్తే ఊరుకోమని, మరో ఉద్యమం తప్పదని టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్ హెచ్చరించారు. భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలని ఆప్రాంత నాయకులు కుట్రలుపన్నుతున్నారని, దీనిపై ఉద్యమించాల్సిన ఇక్కడి ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం సరికాదన్నారు.
భద్రాచలాన్ని ఖమ్మం జిల్లా నుంచి వేరు చేయవద్దంటూ ఖమ్మంలో టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు చేస్తున్న ఆమరణ దీక్ష బుధవారం నాలుగోరోజుకు చేరింది. దీక్షా శిబిరాన్ని శ్రీనివాసగౌడ్ సందర్శించి, ఏలూరికి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఆమరణ దీక్ష చేపట్టిన ఏలూరి శ్రీనివాసరావుకు ఏదైనా హాని జరిగితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. భద్రాద్రి కోసం ఏలూరి చేపట్టిన దీక్షకు మంత్రులు, అధికారులు, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం శోచనీయమన్నారు.