పోలవరం పేరిట చిచ్చుపెట్టొద్దు: సీపీఐ
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు పేరిట తెలుగు ప్రజల్లో చిచ్చుపెట్టొద్దని సీపీఐ ఏపీ రాష్ట్ర శాఖ కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూడడం ఏ మాత్రం సమంజసం కాదని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి ఏటా రెండు మూడు వేల టీఎంసీల గోదావరి నదీజలాలు వృథాగా సముద్రం పాలవుతున్నాయని, వాటిని సద్వినియోగ పరిచే ప్రయత్నాన్ని అడ్డుకోవద్దని టీఆర్‌ఎస్ సహా అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు.
గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం ద్వారా మాత్రమే వెనుకబడిన, కృష్ణా నది ఎగువ ప్రాంతాలకు నీరందించడానికి వీలవుతుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు సత్వర న్యాయం జరిపించాలని, భూమి కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలని రామకృష్ణ కోరారు