'ఆయన సమర్థుడు ... ఇక్కడే ఉంచండి' | DRDA PO Satya srinivas good officer, says ganta srinivasa rao and ch ayyanna patrudu | Sakshi
Sakshi News home page

'ఆయన సమర్థుడు ... ఇక్కడే ఉంచండి'

Published Tue, Nov 18 2014 10:26 AM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM

'ఆయన సమర్థుడు ... ఇక్కడే ఉంచండి'

'ఆయన సమర్థుడు ... ఇక్కడే ఉంచండి'

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో ఉన్నతాధికారుల బదిలీలలో వింత రాజకీయం చోటు చేసుకుంది. జిల్లాలోని ఆర్డీవో అధికారులు బదిలీ అంశంలో కత్తులు నురుకున్న ఇద్దరు మంత్రులు...  ఓ ఉన్నతాధికారి బదిలీ విషయంలో మాత్రం ఒకే మాట మీద నిలబడ్డారు. దీంతో మంత్రుల వ్యవహారశైలిపై జిల్లా వ్యాప్తంగా చర్చ  జరుగుతుంది. జిల్లాలోని డీఆర్డీఏ పీడీ సత్యశ్రీనివాస్ను బదిలీ చేస్తూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయన సమర్థుడైన అధికారి అని... ఆయన్ని విశాఖలోనే కొనసాగించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎం చంద్రబాబుకు సిఫారసు చేశారు.

ఇదే మాటను వారం రోజుల క్రితం విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పొల్లు పోకుండా సీఎం చంద్రబాబుకు లేఖ రాశారని సమాచారం. అయితే విశాఖ ఆర్డీవో వెంకట మురళీ బదిలీల వ్యవహారంలో నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్న సదరు మంత్రివర్యులు  సత్య శ్రీనివాస్ విషయంలో మాత్రం ఒకే మాట మీద నిలబడటంతో ఇదేమిటీ చెప్మా అని అటు పార్టీ నాయకులు, జిల్లా అధికారులు చెవులు కొరుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement