అనావృష్టి నివారణకు వ్యవసాయ అభివృద్ధి నిధి | Drought Prevention Fund for Agricultural Development | Sakshi
Sakshi News home page

అనావృష్టి నివారణకు వ్యవసాయ అభివృద్ధి నిధి

Published Wed, Nov 16 2016 2:39 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

Drought Prevention Fund for Agricultural Development

- 210 మంది జూనియర్ అసిస్టెంట్లు సీనియర్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్
రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు
 
 సాక్షి, అమరావతి: రాయలసీమలోని 4 జిల్లా లతోపాటు ప్రకాశం జిల్లాలో అనావృష్టిని నివారించేందుకు అంతర్జాతీయ స్థారుు వ్యవ సాయ అభివృద్ధి నిధి ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.1,149 కోట్ల అంచనా వ్యయమయ్యే ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ ఎక్స్‌టర్నల్ ఎరుుడెడ్ ప్రాజెక్టుల కింద చేపట్టాలని నిర్ణరుుంచింది. మంగళ వారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి  చంద్రబాబు  అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటి వివరాలను మంత్రులు అచ్చెం నాయుడు,  ప్రత్తిపాటి పుల్లారావు మీడియాకు వెల్లడించారు. మంత్రివర్గం ఇంకా ఏం నిర్ణయాలు తీసుకుందంటే..

► డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ప్రైవేట్ కళాశాలలను గుర్తించడానికి విశ్వవిద్యాలయాల చట్టం-2007ను సవరించాలి. ఇందుకోసం త్వరలో ఆర్డినెన్‌‌స జారీ చేసేందుకు ఆమోదం.
► విజయవాడలో సిద్ధార్థ అకాడమీ ఆధీ నంలో ఉన్న శ్రీదుర్గామల్వేశ్వర స్వామి ఆల యానికి చెందిన 14.20 ఎకరాల లీజు ధర స్థిరీకరణకు ఆమోదం  
► కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 1,93,147 ఇళ్లల్లో 1,20,106 ఇళ్లను ఏపీటీఎస్‌ఐడీసీఓతో, మిగిలిన ఇళ్లను ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా నిర్మించాలి. ఏపీటీఎస్‌ఐడీసీఓ చేపట్టే ఇళ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే వాటా రూ.1,800 కోట్లను వినియోగించాలి. మిగిలిన సొమ్మును హడ్కో నుంచి రుణంగా తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తన సబ్సిడీ వాటాగా రూ.1.50 కోట్లు కేటారుుంపు.
► రాష్ట్ర, జిల్లా, డివిజనల్, మున్సిపల్, మండల, పంచాయతీ స్థారుుల్లో స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ మిషన్ల ఏర్పాటుకు ఆమోదం. మిషన్ ఛైర్మన్‌గా సీఎం, వైస్‌చైర్మన్లుగా పట్టణాభి వృద్ధి, పంచారుుతీరాజ్ శాఖల మంత్రులు.
► విశాఖ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ భూ సమీకరణ పథకం-2016 కింద వ్యక్తిగత భూసమీకరణ ప్రతిపాదనలకు ఆమోదం.
► రాజధానిలో అమృతా యూనివర్సిటీకి 200 ఎకరాలు, ఆర్‌బీఐకి 11 ఎకరాలు, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్‌కు 28 ఎకరాలు కేటారుుంపు. ఆయా సంస్థలో మాట్లాడిన తర్వాత ధర నిర్ణరుుంచాలి.  
► రూ.149కి ఇంటింటికీ ఫోను, ఇంటర్నెట్, కేబుల్ కల్పించే పథకం కోసం ఏపీ ఫైబర్‌నెట్ తీసుకునే రూ.300 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయం. ఫైబర్ నెట్ వడ్డీతోపాటు రుణ వారుుదాలను చెల్లిస్తుంది.
► అనంతపురం జిల్లా రామగిరి మండలం నసనకోటలో కొత్తగా ఏర్పాటు చేసి బీసీ బాలికల ఆశ్రమ పాఠశాల కోసం 13 మంది బోధనా సిబ్బంది, 19 మంది బోధనేతర సిబ్బంది నియామకానికి అనుమతి.
► పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు పూర్తిస్థారుులో 16 పోస్టులు మంజూరు.    
► వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే 210 మంది జూనియర్ అసిస్టెంట్లను సీనియర్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేయడానికి అనుమతి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement