
బాబు వల్లే బీజేపీలో మార్పు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు సంబంధించి బీజేపీ వైఖరిలో మార్పునకు చంద్రబాబే కారణమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. 60 ఏళ్ల పోరాటం తర్వాత తమ నోటికాడికి ముద్ద వచ్చే సమయంలో సీఎం కిరణ్, బాబు, వైఎస్ జగన్‌ల కుట్రలు తెలంగాణ ప్రజలకు తీరని వేదన కలిగిస్తున్నాయన్నారు. ఆదివారం తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన కేంద్రానికి ధన్యవాదాలు చెబుతున్నామని, అయితే తెలంగాణకు నష్టం కలిగించేలా బిల్లులో కొన్ని అంశాలు ఉన్నాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టును ప్రస్తుత నమూనాలో నిర్మించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని కవిత చెప్పారు.