పీఎన్‌కాలనీ (శ్రీకాకుళం): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ ఆదివారం జిల్లాకు విచ్చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆదివారం మధ్యాహ్నం 12:50 గంటలకు రాజాం చేరుకుంటారు. 1:20 గంటలకు జి.ఎం.ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ క్యాంపస్‌కు చేరుకొని నాలుగు గంటల వరకూ అక్కడ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాజాం నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరి శ్రీకాకుళం అర్‌అండ్‌బీ వసతి గృహానికి చేరుకుంటారు.
15వ తేదీ (సోమవారం) ఉదయం 8.30 గంటలకు హెలీకాప్టర్‌లో బయలుదేరి సీతంపేట వెళ్తారు. ఉదయం 8.45 గంటల నుంచి 11.20 గంటల వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం సీతంపేట నుండి హెలీకాప్టర్‌లో విశాఖపట్నానికి బయలుదేరి వెళ్తారు.
నేడు జిల్లాకు గవర్నర్ రాక
Published Sun, Feb 14 2016 12:10 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement
Advertisement