'ఏపీలో పెట్టుబడులకు 8 ఐటీ కంపెనీల సుముఖత' | Eight IT companies ready to tour in Andhra pradesh: Palle raghunadha reddy | Sakshi
Sakshi News home page

'ఏపీలో పెట్టుబడులకు 8 ఐటీ కంపెనీల సుముఖత'

Published Mon, May 18 2015 5:28 PM | Last Updated on Mon, Sep 17 2018 4:27 PM

'ఏపీలో పెట్టుబడులకు 8 ఐటీ కంపెనీల సుముఖత' - Sakshi

'ఏపీలో పెట్టుబడులకు 8 ఐటీ కంపెనీల సుముఖత'

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో పర్యటించేందుకు జపాన్ రాజధాని టోక్యో కు చెందిన 8 కంపెనీలు సుముఖత వ్యక్తం చేశాయని మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. జపాన్ రాజధాని టోక్యో పర్యటనలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలను కలిసినట్టు ఐటీ మంత్రి పల్లె తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటీ, ఎలక్ట్రానిక్ సంస్థలను ఆహ్వానించామని అన్నారు.

ఏపీ ఐటీ పరిశ్రమకు సంబంధించి పెట్టుబడులపై టోక్యోలో పలు సంస్థల ప్రతినిధులను కలిసేందుకు మంత్రి పల్లె టోక్యో పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.  ఆంధ్రప్రదేశ్లో పర్యటించేందుకు 8 కంపెనీలు సుముఖత వ్యక్తం చేశాయని మంత్రి పల్లె చెప్పారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ సోనీ కంపెనీ, తోషిబా, ప్యాన్సోనిక్ వంటి కంపెనీలు ఏపీలో పెట్టుబడులకు సుముఖంగా ఉన్నాయని మంత్రి పల్లె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement