ఎన్నికలకు విఘాతం కలిగిస్తే ... | Election Commission Rules Conditions in Elections | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు విఘాతం కలిగిస్తే ...

Published Sat, Mar 23 2019 1:44 PM | Last Updated on Wed, Mar 27 2019 1:34 PM

Election Commission Rules Conditions in Elections - Sakshi

ఎన్నికలంటేనే కఠిన నియమాలు.. నిబంధనలు..ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారులే సుప్రీంలు.వారికి అన్ని రకాల అధికారాలు.. ఆధిపత్యం ఉంటాయి. అధికారులపై ఏ రాజకీయ నాయకుల ఒత్తిళ్లూ పనిచేయవు. చట్టం పదును పెరగడంతో పోలీసులకు మరింతపవర్‌ పెరిగింది. రాజ్యాంగంలోని ఎన్నికలకు సంబంధించిన అంశాలను కచ్చితంగా అమలు చేసేందుకు ఆ శాఖ సమాయత్తమవుతోంది. ఎన్నికలకు విఘాతం కలిగించే ఏ చిన్న నేరం చేసినా కఠిన శిక్షలే పడనున్నాయి.

ఎన్నికల సమయంలోపోలీసులు పెట్టే కేసులను పరిశీలిస్తే ...
సెక్షన్‌ 125(ఎ) : అభ్యర్థులు తమకు పడిన శిక్షలులేదా తమపై మోపిన నేరాలకు సంబంధించిన విచార ణలు గోప్యంగా ఉంచరాదు. ఒకవేళ ఉంచితే ఆరునెలలు జైలు లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
సెక్షన్‌ 126: ఎన్నికలకు 48 గంటల్లోపు ఊరేగింపు, సమావేశాలు నిర్వహించడం, మీడియా ప్రకటనలు ఇవ్వటం, సంగీత కచేరీలు తదితర వినోద కార్యక్రమాలు నిర్వహించడం నేరం, దీనికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది.
సెక్షన్‌ 127(ఎ): బహిరంగ సమావేశాలకుఅడ్డంకులు సృష్టించరాదు. ఘర్షణలు సృష్టించే ఉద్దేశంతో అరాచకాలకు పాల్పడితే ఆరు నెలలు వరకుజైలు శిక్ష.
సెక్షన్‌ 128: ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వయంత్రాంగం ఎన్నికల ప్రక్రియకు సంబంధించినవిషయాలను గోప్యంగా ఉంచాలి. ఉల్లంఘిస్తే మూడు నెలల జైలు శిక్ష.
సెక్షన్‌ 129: ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు ఏ పార్టీ అభ్యర్థికైనా అనుకూలంగా వ్యవహరిం^è డం నేరం, నిబంధనలు అతిక్రమిస్తే ఆరునెలలు జైలులేదా జరిమానా విధిస్తారు.
సెక్షన్‌ 131, 132: పోలింగ్‌ స్టేషన్‌లో ఉన్న వ్యక్తులకు, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు ఆగ్రహం తెప్పించేలా మెగాఫోన్లు, లౌడ్‌ స్పీకర్లువాడటం నిషేధం. నిబంధనలు అతిక్రమిస్తే మూడు నెలల జైలు లేదా జరిమానాలేదా రెండు విధిస్తారు.
సెక్షన్‌ 134 (ఎ): ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల్లోఆయా పార్టీలకు ఎన్నికల ఏజెంట్లుగా లేదా కౌంటింగ్, పోలింగ్‌ ఏజెంట్లుగా వెళ్లడం నిషేధం. ఒక వేళ వెలితే అందుకు మూడు నెలల జైలు శిక్ష ఉంటుంది.
సెక్షన్‌ 134 (బి): ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, ఉన్నతాధికారుల నుంచి అనుమతి పొందిన సాయుధ పోలీసులను మినహాయిస్తే, మిగతాఎవరు ఆయుధాలు ధరించి పోలింగ్‌ స్టేషన్‌ పరిసరాల్లో కనిపించొద్దు. అలా తిరిగితే రెండేళ్ల జైలు శిక్షవిధించే అవకాశ ముంది.
సెక్షన్‌ 165,166: ఈ సెక్షన్‌లు పోలీసులు వారెంట్‌లేకుండా సోదాలు చేసే అవకాశానిన కల్పిస్తాయి
సెక్షన్‌–352,332,186,189,190: ఎన్నికల విధుల్లోఉన్న ఉద్యోగులను నిరోధించడం. దౌర్జన్యాలు,దాడులకు పాల్పడితే నేరంగా పరిగణిస్తారు. కేసునమోదు చేస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement