ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు
Published Wed, Aug 14 2013 5:04 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ మేరకు 2014లో జరగనున్న శాసనసభ, పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేయూలని, ఓటర్ల జాబితాలో తప్పుల్లేకుండా చూడాలని చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి భన్వర్‌లాల్ కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ బూత్ లెవల్ అధికారుల రిజిస్టర్ల మేరకు ఓటర్ల డేటా అప్‌డేట్ చేయాలని సూచించారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు తది తర అంశాలపై వచ్చిన దరఖాస్తుల పరిష్కా రం, పోలింగ్ స్టేషన్‌ల రేషనలైజేషన్, ఈవీఎం ల పరిశీలన, ఎన్నికల నిర్వహణకు సిబ్బంది వివరాల సేకరణ ఈవీఎంల గొడౌన్‌ల నిర్మా ణం తదితర అంశాలపై ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ ఓటర్ల డేటా ఎంట్రీ పూర్తి చేశామన్నారు. ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పు లు నిమిత్తం క్షేత్ర స్థాయిలో అందిన దరఖాస్తులను పరిష్కరించటం జరుగుతుందన్నారు. ఫారం-6లో 48,390 దరఖాస్తులు అందగా వాటిలో 46,672 దరఖాస్తులను పరిష్కరించ టం జరిగిందన్నారు. ఫారం7లో 27,710 దరఖాస్తులు అందగా వాటిలో 26,998 దరఖాస్తులను పరిష్కరించామన్నారు. అదే విధంగా ఫారం 8లో 1,43,083 దరఖాస్తులకుగాను కేవ లం 1938 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మిగిలినవి పరిష్కరించటం జరిగిందన్నారు. ఫారం 8లో 7342 దరఖాస్తులకు గాను 6,170 దరఖాస్తులను పరిష్కరించటం జరిగిందన్నారు. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల కు రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల ను గుర్తించామన్నారు.
1988 పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా మండల తహశీల్దార్లు పరిశీలించిన అనంతరం ఆర్డీఓలు ఇతర అధికారులు పున పరిశీలన జరపాలని తెలిపారు. ఈవీఎంల తొలిదశ పరిశీలనను త్వరలో పూర్తి చేస్తామన్నారు. నెల్లిమర్లలో ఈవీఎం గొడౌన్ నిర్మాణం కోసం ఒకే టెండరు దాఖలైనందున తదుపరి ఉత్తర్వుల కోసం వేచి ఉన్నామన్నా రు. ఇటీవల పంచాయతీ ఎన్నికలు నిర్వహిం చినందున పోలింగ్ సిబ్బంది వివరాలు సిద్ధం గా ఉన్నాయన్నారు. వెబ్ కాస్టింగ్ కోసం మరి కొంత మంది విద్యార్థులను గుర్తించాల్సి ఉందన్నారు. దీనికి చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి భన్వర్ లాల్ స్పందిస్తూ ఈవీఎం గొడౌన్ నిర్మాణం సంబంధిత ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజినీర్‌తో మాట్లాడి నిర్మాణం త్వరలో పూర్తి చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ కాంతిలాల్ దండేతో పాటు ఏజేసీ యూజీసీ నాగేశ్వరరావు, డీఆర్‌ఓ బి.హేమసుందర వెంకటరావు, విజయనగరం ఆర్డీఓ జి.రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement