సాక్షి, గుంటూరు: ఎందరో ఆశావహులు వెరుు్య కళ్లతో ఎదురు చూస్తున్న ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. ఎన్నికలు జరిగి.. ఫలితాలు వెల్లైడె న రెండు నెలల అనంతరం జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ చైర్‌పర్సన్ల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు వీటి ఎన్నికలు జరగడంతో ఫలితాలు వెల్లడించేందుకు కోర్టు అంగీకరించని విషయం తెలిసిందే.
సాధారణ ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే చైర్మన్ల ఎన్నిక జరుగుతుందని అన్ని పార్టీలూ ఆశించారుు. కానీ ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాతే ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వం స్పష్టం చేయటంతో ఇన్నాళ్లూ ఉత్కంఠ కొనసాగింది. ఎట్టకేలకు గురువారం ముహుర్తం ఖరారు కావడంతో ప్రధాన పార్టీల్లో సందడి నెలకొంది.
ఇదీ షెడ్యూల్.. జిల్లాలోని 12 మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్ చైర్మన్, 57 ఎంపీపీ పదవులకు ఎన్నిక జరగనుంది.
ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ సురేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 29న మున్సిపల్ వార్డుల కౌన్సిలర్లకు నోటీసులు అందించి జూలై 3న జరిగే చైర్‌పర్సన్ ఎన్నికకు హాజరు కావాలని కోరతారు. ఆ రోజున ఆయా మున్సిపాలిటీల కార్యాలయాల్లో ఎన్నిక జరుగుతుంది. అదేవిధంగా మండల పరిషత్‌ల సభ్యులకు ఈ నెల 30వ తేదీన నోటీసులు ఇస్తారు. జులై 4వ తేదీ ఉదయం 10 గంటలకు కో ఆప్షన్ మెంబర్ల ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. 12 గంటలకు స్క్రూట్నీ నిర్వహించి అనుమతించిన నామినేషన్లను ప్రకటిస్తారు. ఒంటి గంటకు ఉపసంహరణ అనంతరం ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నికైన వెంటనే ఫలితాలు వెల్లడిస్తారు. అదేరోజు సాయంత్రం 3 గంటలకు మండల పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల ఎన్నిక జరుగుతుంది. జిల్లా పరిషత్ సభ్యులకు జూలై 1న ఎన్నికలకు సంబంధించిన నోటీసులు అందిస్తారు. జిల్లాపరిషత్ కోఆప్షన్‌సభ్యుల ఎన్నికకు జూలై 5వ తేదీ ఉదయం 10 గంటలకు నామినేషన్ల స్వీకరణ, 12 గంటలకు స్క్రూట్నీ, ఒంటి గంటకు ఉపసంహరణ, అనంతరం ఎన్నిక నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. అదే రోజు సాయంత్రం 3 గంటలకు జిల్లా పరిషత్ చైర్మన్, వైస్‌చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తారు.
ఊపందుకున్న క్యాంపు రాజకీయాలు..
మున్సిపల్, జిల్లాపరిషత్, మండల పరిషత్ చైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో రాజ కీయ పార్టీల క్యాంపు రాజకీయూలు ఊపందుకున్నారుు. సమాన బలం, కొద్దిపాటి తేడా ఉన్న స్థానాల్లో చైర్మన్ పదవులను ఎలాగైనా దక్కించుకునేందుకు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులకు తారుులాలు ఆఫర్ చేస్తున్నారు. క్యాంపు దాటి వారు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే జంప్ జిలానీలకు డబ్బు ఎర చూపుతూ తమవైపు రప్పించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
బెదిరింపులకు దిగుతున్న అధికార టీడీపీ
మండల పరిషత్ ఎన్నికల్లో జిల్లాలోని అనేక మండలాల్లో నువ్వా నేనా అన్నట్లుగా ఫలితాలు రావడంతో ఆయా మండలాల అధ్యక్ష పదవులను కైవసం చేసుకునేందుకు టీడీపీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. ఎంపీటీసీలను నయానో భయానో లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ముహూర్తం ఖరారు
Published Fri, Jun 27 2014 12:02 AM | Last Updated on Tue, Oct 16 2018 6:15 PM
Advertisement
Advertisement