సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే విద్యుత్ చార్జీల మోత మోగనుంది. అంటే మే 8 నుంచే కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. అప్పటివరకు ప్రస్తుతమున్న విద్యుత్ చార్జీలనే వసూలు చేస్తారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) బుధవారం ఆదేశాలు జారీ చేయనుంది. వాస్తవానికి 2014-15 ఆర్థిక సంవత్సరానికిగానూ ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలను అమలు చేయాల్సి ఉంది. అయితే ఎన్నికల నియమావళి వల్ల ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని ఈఆర్‌సీని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు మే 7తో ముగియనున్నాయి. ఆ వెంటనే సుమారు రూ. 5,600 కోట్ల విద్యుత్ చార్జీల భారం రాష్ట్ర ప్రజలపై పడనుంది.
ఎన్నికల తర్వాతే కరెంటు మోత!
Published Wed, Mar 26 2014 1:45 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM
Advertisement
Advertisement