విద్యుత్తు, నీరు, టెలిఫోన్ బిల్లులు బకాయిలు పడ్డ పార్టీల అభ్యర్థులను కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని ఈసీ యోచిస్తోంది.
న్యూఢిల్లీ: విద్యుత్తు, నీరు, టెలిఫోన్ బిల్లులు బకాయిలు పడ్డ పార్టీల అభ్యర్థులను కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని ఈసీ యోచిస్తోంది. దీనిపై అభిప్రాయం తెలపాల్సిందిగా పార్టీలకు ఈసీ లేఖలు రాసింది.
ప్రస్తుతం అభ్యర్థుల పేరున బకాయిలుంటే అనర్హులుగా ప్రకటిస్తోంది. ఇక నుంచి పార్టీ కార్యాలయాల బిల్లులు బకాయిపడ్డా పార్టీ అభ్యర్థులందరినీ అనర్హులుగా ప్రకటించాలని యోచిస్తోంది.