విద్యుత్ శాఖకు తలనొప్పిగా మారిన అక్రమ కనెక్షన్లు
లైన్ డైవర్షన్, అనధికారిక లోడ్‌తో తీవ్ర నష్టం
ఆదాయం కోల్పోతున్న సంస్థ
కర్నూలు(రాజ్‌విహార్) : గ్రామాలు, పట్ణాణాల్లో విద్యుత్ అక్రమ కనెక్షన్లు ఎక్కువుతున్నాయి. కొందరు వ్యక్తులు విద్యుత్ చౌర్యానికి పాల్పడుతుండడంతో సంస్థకు తీవ్ర నష్టం చేకూరుతోంది. అక్రమ కనెక్షన్లు, అనధికారిక లోడు కారణంగా లక్షల యూనిట్లు లెక్కలేకుండా పోతున్నాయి. సబ్‌స్టేషన్ల నుంచి డ్రా అవుతున్న విద్యుత్‌కు తగిన మొత్తంలో బిల్లులు రావడం లేదని అధికారులు నిర్ధారిస్తున్నారు. ‘కొక్కెం’ సమస్యతో ఏపీ ఎస్‌పీడీసీఎల్ విద్యుత్ పంపిణీ సంస్థ లక్షల రూపాయల ఆదాయాన్ని కోల్పొతోంది.
కర్నూలు సర్కిల్ (జిల్లా)లో 8కేటగిరీల కింద మొత్తం 11లక్షల కనెక్షన్లు ఉన్నాయి. అనధికారి కనెక్షన్లు వేల సంఖ్యలో ఉంటాయని అధికారుల అంచనా. జిల్లా అవసరాల కోసం రోజుకు కోటి యూనిట్లు విద్యుత్ కోటా ఇస్తున్నారు. వినియోగంలో ఉన్నా నెలకు లక్షల యూనిట్ల వరకు బిల్లింగ్‌లోకి రావడం లేదని ఎనర్జీ ఆడిటింగ్‌లో తేలింది. దీనిని అధికారులు చౌర్యం, టెక్నికల్, ఇతర లైన్‌లాస్ కింద అంచానా వేసి అధికారులకు నివేదికలిచ్చినట్లు సమాచారం.
కొంత మంది కనెక్షన్ దరఖాస్తులో కనపర్చిన లోడ్ కంటే ఎక్కువ విద్యుత్ వాడకంతో ట్రాన్స్‌ఫార్మర్లపై భారం పెరగడం, లో ఓల్టేజీ సమస్యకు కారణమవుతోంది. ఈక్రమంలో ప్రత్యేకం గా ఏర్పాటు చేసిన డీపీ ఈ (విద్యుత్ చౌర్యం నివారణ విభాగం) దాడులు విస్తృతంగా చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఈక్రమంలో 2014-15లో 3,098 కేసుల నమోదు చేసి రూ. 2.24కోట్లు అసెస్‌మెంట్ పేరుతో జరిమానా విధించారు.
- కేసుల్లో కర్నూలుకు మూడో స్థానం:
విద్యుత్ చౌర్యం కేసుల్లో విద్యుత్ పంపిణీ సంస్థలోనే కర్నూలుది మూడో స్థానం. 5300 కేసులతో కడప మొదటి స్థానంలో ఉండగా గుంటూరు 5256 కేసులతో రెండు స్థానంలో ఉంది. కర్నూలులో గత ఏడాది 3098కేసులు నమోదు కావడంతో మూడు స్థానంలో ఉంది.
కరెంట్‌ను దోచేస్తున్నారు!
Published Wed, May 20 2015 4:22 AM | Last Updated on Sat, Aug 18 2018 8:49 PM
Advertisement
Advertisement