హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మొదలు పెట్టిన ఆత్మగౌరవ యాత్ర తొలివిడత రేపటితో ముగియనుంది. 11 రోజుల నుంచి చంద్రబాబు 9 శాసనసభ నియోజకవర్గాలలో పర్యటించారు.
రాష్ట్ర విభజనపై ఒక స్పష్టమైన వైఖరి వ్యక్తం చేయకపోవడంతో అడుగడుగునా ఆయనకు వ్యతిరేక వ్యక్తమయింది. గత రాత్రి చంద్రబాబు బసచేసిన కృష్ణా జిల్లా కంభంపాడు వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజనపై వైఖరేంటో స్పష్టంచేయాలన్న గ్రామస్థులు ఆయనను నిలదీశారు. గ్రామస్థులపై చంద్రబాబు మండిపడ్డారు. రౌడీలు, గూండాలంటూ దుర్భాషలాడారు. తోకలు కత్తిరిస్తానంటూ బెదిరించారు. చంద్రబాబును నిలదీసిన గ్రామస్థులపై స్థానిక టీడీపీనేత ఒకరు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. చంద్రబాబు ఆదేశాలతోనే కేసు పెట్టారని బాధితులు ఆరోపించారు.