ఎన్ ఫోర్స్ మెంట్ దాడి..రేషన్ డీలర్ ఆత్మహత్య | enforcement rides..ration dealer commited suicide | Sakshi
Sakshi News home page

ఎన్ ఫోర్స్ మెంట్ దాడి..రేషన్ డీలర్ ఆత్మహత్య

Published Thu, Feb 12 2015 6:46 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

enforcement rides..ration dealer commited suicide

ప్రకాశం(ఒంగోలు): ప్రకాశం జిల్లా సీమకుర్తి మండలం దేవరపాలెం గ్రామ రేషన్ డీలర్ పెండ్యాల బ్రహ్మానందం(45) ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడుల్లో అక్రమ బియ్యం స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేస్తామని అనడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్లిన బ్రహ్మానందం గురువారం ఉదయం ఒంగోలు రైల్వేస్టేషన్ సదరన్ వైపు ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్ వద్ద వున్న పార్కు ఎదుట ఆత్మహత్య చేసుకున్నాడు. అతని జేబులో విజయవాడకు వెళ్లడానికి అవసరమైన టికెట్ లభించింది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అతని కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement