త్వరితగతిన ఇంజినీరింగ్ పనులు
Published Fri, Jan 3 2014 4:47 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్:ఇంజినీరింగు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీ లాడ్స్, పంచాయతీరాజ్, నీటిపారుదల, పీడబ్ల్యూడీ తదితర విభాగాల ద్వారా పనులను చేపట్టేందుకు ప్రభుత్వం కచ్చితమైన మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. వాటిని తు.చ. తప్పకుండా పాటించి పనులు చేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయి కమిటీ, స్వయం సహాయక సంఘాలు, వినియోగిత సంఘాలకు పనులను అప్పగిం చాలన్నారు. ఎంపీ లాడ్స్‌కు, పంచాయతీ రాజ్, నీటిపారుదల పనులను సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి చేపట్టాలని స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ కింద చేపట్టే చెరువుల గండి తదితర పనులను నీటి వినియోగదారుల సంఘాల ద్వారా చేపట్టవచ్చునని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్.ఎస్.రాజకుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థప్రాజెక్టు డెరైక్టర్ పి.రజనీకాంతరావు, జెడ్పీ సీఈవో టి.కైలాశగిరీశ్వర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement