స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన ఇంగ్లిష్ పేపర్-2 పరీక్ష పత్రం ప్రారంభమైన ....
చిలమత్తూరు: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన ఇంగ్లిష్ పేపర్-2 పరీక్ష పత్రం ప్రారంభమైన గంటకే బిట్ పేపర్‌తో కలిపి బయటకు వచ్చింది. ఇది జిరాక్స్ సెంటర్లకు చేరుకోవడంతో సమాధానాలు బయట నుంచి పరీక్ష కేంద్రంలోకి వెళ్లిపోయాయి. తెలుగు పేపర్-1 పరీక్ష రోజు కూడా వాట్సప్ ద్వారా ప్రశ్నపత్రం, బిట్ పేపర్ బయటకు వచ్చాయి.
ఈ విషయమై పరీక్ష నిర్వహణ అధికారులను ప్రశ్నిస్తే ఎవరు లీక్ చేస్తున్నారో తెలియదన్నారు. మంగళవారం నుంచి పకడ్బందీ చర్యలు చేపడతామన్నారు. సోమఘట్ట, కొడికొండ, కోడూరు, ఉర్దూ, చిలమత్తూరు, కేజీబీవీ, గురుకుల పాఠశాల, గాడ్రాళ్లపల్లి ఉన్నత పాఠశాల నుంచి దాదాపు 534 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు.