ఆదర్శం
స్నేహానికి నిర్వచనం చెబుతున్న నాగేంద్రనగర్ యూత్
మరణించిన స్నేహితుల కుటుంబాలకు భరోసా
ఆపదలో వున్న వారికి అండగా సేవలు
విశాఖపట్నం : వారంతా అటూఇటుగా ఇరవై ఏళ్ల యువకులు. కొం దరు ఇంజనీరింగ్ వంటి చదువులు చదువుతుండగా, ఇం కొందరు చిరు వ్యాపారులుగా, ప్రయివేటు ఉద్యోగస్తులు గా, పోలీసు, హోంగార్డులుగా వున్నారు. ఇలాంటి వంద మంది యువకులు కలిసి నాగేంద్రనగర్ యూత్ అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. సేవకు సరికొత్త నిర్వచనం చెబుతున్నా రు. గ్రామంలో గణపతి ఉత్సవాలు, దుర్గా వేడుకలు నిర్వహిస్తున్నారు. పేద విద్యార్థులకు ఆసరాగా నిలుస్తున్నారు. ఊరూరూ తిరిగి పాతపుస్తకాలు సేకరించి, వాటిని బాగు చే సి పేద విద్యార్థులకు ఇస్తుంటారు. ఇంటా అనాథ బాలల కు, పేద విద్యార్థులకు తోచిన సాయం అందిస్తున్నారు.
ఉద్యమంలా రక్తదానం
వీరు అత్యవసరస్ధితిలో రోగులకు, క్షతగాత్రులకు, గర్భిణులకు రక్తదానం చేస్తున్నారు. ఏటా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన గ్రామస్తులు, యువకుల జ్ఞాపకార్ధం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. అత్యవసర స్ధితిలో ఆసుపత్రిలో చేరిన రోగులకు రక్తదాన కూపన్లు ఇవ్వడం, నేరుగా వెళ్లి రక్తం ఇవ్వడం చేస్తున్నారు. గత ఏడాది వీరిలో ఓ స్నేహితుని తల్లి క్యాన్సర్‌తో ఆసుపత్రిపాలవ్వగా 20రోజులకోసారి రక్త మార్పిడి అవసరమయింది. అందుకు స్తోమత లేని ఆ స్నేహితునికి తాము వున్నామని భరోసా ఇస్తూ ఆమెకు తలొకరుగా రక్తమిస్తూ ఎనిమిది నెలలుగా బతికించుకుంటున్నారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇటీవల ఉప్పిలి శివ అనే స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే అతని పేరుతో పెద్దపెద్ద రాజకీయ నాయకుల జయంతిని తలపించేలా వేడుక జరిపారు. ఆరోజు 150మంది యువకులు రక్తదానం చేశారు. ఆ స్నేహితుని తరపున కుటుంబ బాధ్యత తాము తీసుకుని సోదరికి వివాహం చేయడానికి రెండు లక్షలు పోగు చేశారు. ఇలా వీరి మంచితనాన్ని చూసి అటు ఎన్‌ఏడీ జంక్షన్ నుంచి పెందుర్తి వరకూ మరో వందమంది స్నేహితులు అసోసియేషన్‌లో సభ్యులయ్యారు.
ఫోన్ చేస్తే స్పందిస్తాం
మేం చేస్తున్న సేవ ఆర్థిక సాయం కంటే గొప్పది. ఆ తృప్తి అంతా ఇంతా కాదు. రక్తం అవసరమయితే ఫోన్: 9346334 295, 8142821 082, 9493293432 నంబర్లకు ఫోన్ చేస్తే స్పందిస్తాం.
- కృష్ణాచారి
24 గీ 7 సేవలు
మా సంస్ధలో ఎవరిలోనూ వ్యక్తిగత స్వార్ధంలేదు. కులమత ప్రాంతీయ భేదాలు లేవు. ఏ వేళ పిలిచినా సహాయం అందిస్తాం. నేను ఇప్పటికి ఏడుసార్లు రక్తదానం చేశాను.
- ఎస్‌కే రెహ్మన్
అందరం అధ్యక్షులమే
మా యూత్ అసోసియేషన్‌కి సభ్యులంతా నాయకులే. ఎవరినయినా ఆదుకున్నపుడు ఏదో విజయం సాధించినంత ఆనందంగా వుంటుంది.. నేను ఏటా మూడుసార్లు రక్తదానం చేస్తాను.
- బొడ్డేటి విజయ్‌కుమార్