
నగరం మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా!
తూర్పు గోదావరి జిల్లా నగరంలో చోటుచేసుకున్న గెయిల్ పైప్‌లైన్ పేలుడు దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
నగరం: తూర్పు గోదావరి జిల్లా నగరంలో చోటుచేసుకున్న గెయిల్ పైప్‌లైన్ పేలుడు దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు గెయిల్ కంపెనీ నుంచి 20 లక్షలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 3 లక్షలు, కేంద్రం నుంచి 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఎన్ఎఫ్సీఎల్, జీఎఫ్సీఎల్, ల్యాంకో లాంటి పరిశ్రమలకు గ్యాస్ను సరఫరా చేసేందుకు గ్యాస్ కలెక్షన్ స్టేషన్ నుంచి వెళ్లే ప్రధానమైన ట్రంకుపైపులైను మామిడికుదురు మండలం నగరం వద్ద పేలడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా, 25 మందికి గాయాలు కాగా, వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది.