సఖినేటిపల్లి - నర్సాపురం బ్రిడ్జి పనులు నిలిచిపోవడానికి అమలాపురం ఎంపీ జి.హర్షకుమార్ ముఖ్య కారణమని మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు ఆదివారం ఆరోపించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని సీఎం కిరణ్కుమార్రెడ్డి గాలి కొదిలేశారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను విమర్శించడమే సీఎం కిరణ్ పనిగా పెట్టుకున్నారని అంతకు మించి మరో పని లేదని అల్లూరు కృష్ణంరాజు ఎద్దేవా చేశారు.