యర్రగొండపాలెం టౌన్, న్యూస్‌లైన్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో నాటుసారా తయారీపై ఎక్సైజ్ అధికారులు మంగళవారం మెరుపుదాడులు నిర్వహించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఎన్‌వీఎస్ ప్రసాద్ ఆదేశాల మేరకు యర్రగొండపాలెం ప్రొహిబిషన్, ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని గ్రామాల్లో నిర్వహించిన ఈ తనిఖీల్లో యర్రగొండపాలెం మండలంలోని పిల్లికుంటతండాలో నాటుసారా క్యాన్లతో ఉన్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. దేశావత్ అంజీబాయి, దేశావత్ సోమీబాయిలను అదుపులోకి తీసుకుని వారి నుంచి 20 లీటర్ల నాటుసారా క్యాన్లను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నెరజాములతండా పొలిమేరలో 5 ప్లాస్టిక్ క్యాన్లు, మట్టికుండల్లో దాచిఉంచిన 1050 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చే శారు. అనంతరం నిందితులతో కలిసి స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎక్సైజ్ సీఐలు ఎం.వీరాస్వామి, ఎస్‌కేఎండీ అబ్దుల్‌జలీల్‌లు వివరాలు వెల్లడించారు. ఎస్సైలు కే వెంకటేశ్వరరావు, ఏ రవి, హెడ్‌కానిస్టేబుల్ ఎన్.శ్రీనివాసరావు, సిబ్బంది జే శ్రీపతి, ఎన్.సుబ్బయ్య, ఏ నాగేశ్వరరావు, పీ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
నాటుసారా తయారీ చెక్క స్వాధీనం...
పుల్లలచెరువు, న్యూస్‌లైన్ : మండలంలోని నరజామలతండా వద్ద నాటుసారా తయారుచేసే చెక్కను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పుల్లలచెరువు నుంచి మురికిమల్ల వెళ్లే రోడ్డుపై ఉన్న చప్టాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు నరజామలతండాలో నాటుసారా కాస్తున్నట్లు స్థానికుల ద్వారా సమాచారం అందింది. దీంతో అక్కడకు వెళ్లి దాడిచేయగా పోలీసులను చూసిన ఒకవ్యక్తి పరారయ్యాడు. ఆ ప్రాంతంలో ఉన్న నాటుసారా తయారుచేసే చెక్కను స్వాధీనం చేసుకున్నట్లు సబ్ ఇన్‌స్పెక్టర్ ఫణిభూషణ్ తెలిపారు.
ఎక్సైజ్ అధికారుల మెరుపుదాడులు
Published Wed, Jan 8 2014 2:45 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement
Advertisement