
పిల్లలకు విషమిచ్చి దంపతుల ఆత్మహత్య
ఇద్దరు చిన్నారులతో తల్లిదండ్రులు మృతి చెందిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విషాదం చోటు చేసుకుంది.
రాజమండ్రి: ఇద్దరు చిన్నారులతో తల్లిదండ్రులు మృతి చెందిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని సారంగధరమెట్టలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తమ పిల్లలకు విషమిచ్చి తల్లిదండ్రులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు విజయనగరం జిల్లా పాలకొండకు చెందిన కింజెరపునాయుడు కుటుంబ సభ్యులుగా గుర్తించారు.
ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగానే వీరు ఆత్మహత్యకు పాల్పడివుంటారని అనుమానిస్తున్నారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉండేవారని చుట్టుపక్కల వారు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.