దొంగ పాస్ పుస్తకాలు సృష్టించి తన భూమిని వేరొకరు కొట్టేశారనే మనస్తాపంతో ఓ రైతు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేయబోయాడు.
కర్నూలు : దొంగ పాస్ పుస్తకాలు సృష్టించి తన భూమిని వేరొకరు కొట్టేశారనే మనస్తాపంతో ఓ రైతు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దనెలటూరు గ్రామానికి చెందిన నారాయణ శెట్టికి గ్రామంలో 5 ఎకరాల 70సెంట్ల భూమి ఉంది. ఈ భూమిని గొల్ల రాములు అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చాడు.
కాగా రాములు తన పొలం కౌలు చేస్తూ ఎమ్మార్వో, వీఆర్‌ఓలతో కలసి దొంగ పాస్ పుస్తకాలు సృష్టించారని నారాయణ శెట్టి ఆరోపించారు. తనకు న్యాయం చేయకపోతే కిరోసిన్ పోసుకుని ఇక్కడే నిప్పంటించుకుంటానని చెప్పి కిరోసిన్ మీద పోసుకున్నాడు. నిప్పంటించుకోబోతుండగా అక్కడున్నవారు అప్రమత్తమై నారాయణను పోలీసులకు అప్పగించారు. పోలీసులు నారాయణను మూడవ పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు.