సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రైతుల హక్కులను కాలరాస్తోందని, తమ అనుమతి లేకుండా తమ భూములను సింగపూర్ కంపెనీలకు ఇవ్వడానికి ప్రభుత్వానికి హక్కు ఎక్కడిదని రాజధాని ప్రాంత రైతులు ధ్వజమెత్తుతున్నారు. గ్రాఫిక్స్ డిజైన్లు, ఊహా చిత్రాలతో ప్రభుత్వం మభ్యపెడుతోంది తప్పితే క్షేత్రస్థాయిలో అభివృద్ధి అనేది మచ్చుకైనా కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. తమ భూములతోపాటు కృష్ణా నదిని కూడా సింగపూర్ కన్సార్టియానికి రాసిచ్చేలా ప్రభుత్వ చర్యలున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పూలింగ్‌కు ఇవ్వకపోయినా..
రాజధాని గ్రామాలైన తాళ్లాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెంలలో 1691 ఎకరాలను సింగపూర్ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వమే చదును చేసి అమరావతి డెవలప్‌మెంట్ పార్టనర్స్‌కి అప్పగించాలి.
ఇలా అప్పగించిన భూమిని అభివృద్ధి చేసి ప్లాట్లుగా విభజించిన తర్వాత సింగపూర్ కంపెనీలు ఇతరులకు విక్రయించనున్నాయి. కాగా.. ఈ మొత్తం 1691 ఎకరాల్లో సుమారు 200 ఎకరాలను రైతులు భూసమీకరణకు ఇవ్వలేదు. అయినా రైతుల అనుమతి లేకుండా ప్రభుత్వం అప్రజాస్వామికంగా భూములను సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టడంపై రైతులు మండిపడుతున్నారు.
ప్లాట్లను అభివృద్ధి చేయకుండా ఒప్పందాలు
రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 25 వేల మంది రైతుల నుంచి 34 వేల ఎకరాలను సేకరించింది. దీనికి ప్రతిగా ప్రభుత్వం సుమారు 60 వేల రిటర్నబుల్ ప్లాట్లను రైతులకు కేటాయించింది. ఈ ప్రక్రియ ప్రారంభమై రెండేళ్లవుతున్నా ఇంతవరకు ఏ ఒక్క ప్లాటునూ ప్రభుత్వం అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. తమకు ఇచ్చిన ప్లాట్లను ఇంతవరకు అభివృద్ధి చేయని ప్రభుత్వం.. సింగపూర్ కంపెనీలకు ఇచ్చిన భూమిని ఎలా అభివృద్ధి చేస్తుందని రైతులు ప్రశ్నిస్తున్నారు.
దళితులమనే దగా చేస్తోంది..
బ్రిటిష్ పాలనలో మాకు భూములు పంపిణీ చేశారు. రాజధాని కోసం సమీకరిస్తున్న భూములన్నింటికి ప్రభుత్వం ఒకే తరహా ప్యాకేజీ ఇవ్వడం లేదు. దళితులమనే మాకు అన్యాయం చేస్తోంది. పూలింగ్ ఇవ్వని భూములను మా అనుమతి లేకుండా స్టార్టప్ కంపెనీలకు కట్టబెట్టడంలో ప్రభుత్వ ఆంతర్యం ఏమిటి? రైతులకు ఇచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేయకుండా ప్రజా ధనాన్ని విదేశీ కంపెనీలకు ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. – కలపాల ప్రభుదాస్, రైతు, లింగాయపాలెం

Comments
Please login to add a commentAdd a comment