కొనుగోలు కేంద్రంలోనే నిల్వలు
గోడౌన్‌ల కొరతకుతోడు రవాణాకు ఇబ్బంది
అమ్మకానికి ముందుకు రాని రైతులు
తెనాలిటౌన్/కొల్లిపర : ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటలు అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడు తున్నారు. మార్కెఫెడ్ అధికారులు రవాణా సౌకర్యం కల్పించకపోవటంతో మొక్క జొన్న నిల్వలు కొనుగోలు కేంద్రంలోనే ఉంటున్నాయి. ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 1310, తెల్లజొన్నకు రూ.1510 గా నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా 43 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఈ కేంద్రాత్లో ఐకేపీ, డీసీఎంఎస్, సొసైటీల ద్వారా కొనుగోలు చేయటానికి బాధ్యతలు మార్కెఫెడ్‌కు అప్పగిం చింది. కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేక, రవాణా సౌకర్యాల ఇబ్బం దులు, గోడౌన్‌ల కొరత వల్ల ైరె తులు మొక్కజొన్న,జొన్న పంటలను అమ్ముకునేందుకు రావటం లేదు. కొందరు రైతులు అమ్మకానికి తీసుకువచ్చినప్పటికి అక్కడ తేమ శాతం, నాణ్యత తదితరాలను చూసి కొనుగోలు చేస్తుండటంతో తరుగులు పోతున్నాయనే ఉద్దేశంతో రైతులు అమ్ముకోవటానికి రావడం లేదు.
బయట మార్కెట్‌లో క్వింటాల్ మొక్కజొన్న రూ.1100 నుంచి 1150 వరకు కొనుగోలు చేస్తున్నారు. బయట వ్యాపారులు తక్కువ ధరకు అడుగుతుండటంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. అక్కడా సరైన వసతు లు కల్పించటంలో అధికారులు విఫలమవటంతో రైతులకు అవస్థలు తప్పడంలేదు.
ఆరుబయటే మొక్కజొన్న బస్తాలు...
కొల్లిపర మండలం హనుమాన్‌పాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో వసతులు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. గతనెల చివరి రోజున తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఇప్పటి వరకు 2989 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. వాటిలో 1176 క్వింటాళ్లను మాత్రమే మార్కెఫెడ్ ఏర్పాటు చేసిన గోడౌన్‌కు తరలించారు.
మిగిలిన వాటిని అక్కడే ఉన్న ప్రభుత్వ పాఠశాల ఆవరణలో, ఆరుబయట ఉంచారు. దీంతో రైతులు ఎప్పుడు వాన వస్తుందో అన్న ఆందోళనలో ఉన్నారు. లారీలు రాకపోవటంతో మొక్కజొన్నలు అక్కడే ఉండిపోతున్నాయి. రైతులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు లారీలకు ఎత్తుతారో తెలియక, వేరే పనులకు వెళ్లలేక ఇక్కడే ఉండాల్సి వస్తోంది.
మొక్కజొన్నకు దిక్కేది ?
Published Wed, May 13 2015 4:21 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement