నెల్లూరు(విద్యుత్): టీబీ హాస్పిటల్‌తో పాటు డీఎస్సార్ ఆస్పత్రి(పెద్దాసుపత్రి) నుంచి ఐదుగురు హెడ్‌నర్సులను మెడికల్ కళాశాలకు బదిలీ చేస్తూ మంగళవారం వెలువడిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. అందరూ మెడికల్ కళాశాలకు బదిలీ కోరుతుండగా కొందరికే అవకాశం కల్పించడమేంటమని మిగిలిన ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఉత్తర్వులు వెలువడిన ప్రక్రియపై అభ్యంతరం తెలిపారు. నగరంలోని డీఎస్సార్, జూబ్లీ, రేబాల, టీబీ ఆస్పత్రులకు సంబంధించిన వైద్యాధికారులు, హెడ్‌నర్సులు, నర్సులు, నాలుగో తరగతి సిబ్బంది మెడికల్ కళాశాలకు బదిలీ కోరుకుంటున్నారు.
ఈ మేరకు ఇటీవల వీరంతా కేంద్ర, రాష్ట్ర మంత్రులను కలిసి విన్నవించారు. ప్రస్తుతం డీఎస్సార్, రేబాల హాస్పిటళ్లలో 36 మంది, టీబీ హాస్పిటల్‌లో ఆరుగురు, జూబ్లీ హాస్పిటల్‌లో 17మంది వైద్యాధికారులు పనిచేస్తున్నారు. అలాగే స్టాఫ్‌నర్సులు 110 మంది, హెడ్ నర్సులు 22 మంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే డీఎస్సార్ ఆస్పత్రి నుంచి ముగ్గురు, టీబీ ఆస్పత్రి నుంచి ఇద్దరు హెడ్‌నర్సులను వైద్య కళాశాల పరిధిలోకి తీసుకోవాలని మంగళవారం నిర్ణయం ఉత్తర్వులు వచ్చాయి. డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నుంచి డీఎస్సార్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ రవీంద్రనాథ్‌ఠాగూర్‌కు ఈ ఉత్తర్వులు అందాయి. విషయం తెలుసుకున్న మిగిలిన ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అందరూ మెడికల్ కళాశాలకు బదిలీ కోరుకుంటుంటే కొందరే దొడ్డిదారిన నియామక పత్రాలు ఎలా తెచ్చుకుంటారని సూపరింటెండెంట్‌ను ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం డీఎంఈ నేరుగా వైద్యవిధాన పరిషత్ కమిషనర్‌కు, అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్(డీసీహెచ్‌ఎస్)కు నియామక ఉత్తర్వులు రావాలని, కానీ నేరుగా డీఎంఈ నుంచి మెడికల్ సూపరింటెండెంట్‌కు ఎలా పంపుతారని మండిపడుతున్నారు.
కమిషనర్ ఆదేశాల మేరకు పనిచేస్తా
ఐదుగురు హెడ్‌నర్సులకు సంబంధించి నియామక పత్రాలు వచ్చిన విషయం వాస్తవమే. ఈ విషయంపై వైద్యవిధాన పరిషత్ కమిషనర్‌కు ఫ్యాక్స్ ద్వారా సమాచారం అందించాను. వారి ఆదేశాల మేరకు నడుచుకుంటాం.
రవీంద్రనాథ్‌ఠాగూర్, మెడికల్ సూపరింటెంట్
ఐదుగురు హెడ్‌నర్సులు మెడికల్ కాలేజీకి..
Published Wed, Sep 3 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 PM
Advertisement
Advertisement